Home » Entertainment » Anasuya Is Serious On Hyper Aadi
Entertainment

Anasuya : ‘జబర్దస్త్’ హైపర్ ఆదిపై అనసూయ సీరియస్.. ఇకపై అలా చేస్తే..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 5, 2021, 9:00 pm
Advertisement

Anasuya : ‘జబర్దస్త్’ షో ద్వారా బుల్లితెర‌పై సందడి చేసిన చాలా మందికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా వారు వెండితెరపైన కనబడటమే కాదు సత్తా చాటారు, చాటుతున్నారు. యాంకర్ అనసూయ ప్రజెంట్ బుల్లితెరపైన, వెండితెరపైన రెండిటిపైన మెరుస్తోంది. ఈ సంగతులు ఇలా ఉంచితే.. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో మొదటి నుంచి కమెడియన్ హైపర్ ఆది యాంకర్ అనసూయపై పంచులు వేస్తుండటం తెలిసిందే. కాగా, ఈ మధ్య అనసూయ ఆయనపై సీరియస్ అయిందట.హైపర్ ఆది మొదట్లో కొంచెం ఢిపరెంట్ స్కిట్స్ చేసేవాడని, రాను రాను అనసూయ కోసమే స్కిట్స్ చేస్తున్నాడని, ఆమెతో లవ్ ట్రాక్, డ్యాన్స్ చేసేందుకుగాను స్కిట్స్ ప్లాన్ చేస్తున్నాడని పలు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

anasuya is serious On Hyper aadi

Anasuya : కంటెంట్ లేకపోవడం వల్లే అనసూయపై కాన్సంట్రేషన్..!

అయితే, హైపర్ ఆది మాత్రం ప్రతీ ఎపిసోడ్‌లోనూ కచ్చితంగా అనసూయ డ్యూయెట్ ఉండేలా లేదా కనీసం లవ్ ట్రాక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న మాట వాస్తవమే. అయితే, ఒకప్పుడు ఉన్నంత బాగా ఇప్పుడు హైపర్ ఆది స్కిట్స్ ఉండటం లేదనే కొందరు అంటున్నారు. ఈ మేరకు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. హైపర్ ఆది పంచులు అస్సలు పేలడం లేదని, అనసూయపైన కంటే కూడా స్కిట్‌పైన కాన్సంట్రేట్ చేస్తే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు.

Advertisement

Hyper Aadi Counters On Dhee Poorna

ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు అనసూయపైన పంచులు వేయడం మానేసిన హైపర్ ఆది తాజాగా మళ్లీ అనసూయను కేంద్రబిందువుగా పెట్టుకుని స్కిట్ చేయడం ప్రారంభించాడట. ఈ క్రమంలోనే స్కిట్‌లో తన వ్యక్తిగత విషయాలు మాట్లాడటం పట్ల అనసూయ భరద్వాజ్ సీరియస్ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు ప్లే చేసి తనను ఆ స్కిట్‌లో వస్తువులా వాడుకోవద్దని హైపర్ ఆదిని అనసూయ హెచ్చరించిందని సమాచారం. హైపర్ ఆది తన వద్ద చేయడానికి కంటెంట్ లేకనే ఇలా పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ పెట్టుకుని, అనసూయను అడ్డుపెట్టుకుని బుల్లితెరపైన సందడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు.

Advertisement

anasuya bharadwaj double meaning in jabardasth

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి