chiranjeevi Movie In gangavv
Gangavva : తన యాస, భాషతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది గంగవ్వ. తెలంగాణ యాసలో అచ్చమైన భాషలో మాట్లాడుతూ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్‌పై దూసుకుపోతోంది. గంగవ్వకు వరుస సినిమా అవకాశాలు వస్తుండగా వాటన్నిటిలో నటిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు గంగవ్వ తెలిపింది.శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరి’ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నానని పేర్కొంది. ఈ క్రమంలోనే గంగవ్వ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది.
chiranjeevi Movie In gangavv
మెగాస్టార్ చిరు చిత్రం షూటింగ్ ప్రజెంట్ ఊటిలో జరుగుతుందని, ఇంటర్వ్యూ కోసం తాను అక్కడి నుంచి వచ్చినట్లు గంగవ్వ వివరించింది. ‘లవ్ స్టోరి’ చిత్రంలోనూ గంగవ్వ ఓ పాత్ర పోషించింది. సహజ నటనకు కేరాఫ్ అయిన గంగవ్వ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘మై విలేజ్ షో’ డైరెక్టర్ శ్రీకాంత్ నిర్వహించిన కార్యక్రమం ద్వారా గంగవ్వ కెరీర్ స్టార్ట్ అయింది. అందులో గంగవ్వ నటనను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
Chiranjeevi
రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ఫిల్మ్‌లో మంచి పాత్ర పోషించింది గంగవ్వ. ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రంలోనూ గంగవ్వ నటించింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్ర షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ మూవీస్ షూట్ బిజీలో ఉన్నాడు. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్‌లో ప్రజెంట్ ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు తల్లిగా గంగవ్వ కనిపించనుంది. ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు రీమేక్. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చిరు మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ చిత్రంలో నటించనున్నారు. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తిసురేశ్ మెగాస్టార్‌కు చెల్లెలిగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో ఓ మాస్ మూవీ చేయనున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.