Home » Entertainment » Anasuya Left Suddenly Knowing That Chalaki Chanti Had A Heart Attack
Entertainment

Anasuya : చలాకీ చంటి కి గుండెపోటు వచ్చింది అని తెలిసి .. హుటాహుటిన బయలుదేరిన అనసూయ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 24, 2023 2:01 pm
Advertisement

Anasuya : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ కామెడీ షో ద్వారా చలాకి చంటి బాగా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు సినిమాలలో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. తనదైన స్టైల్ లో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. అంతే కాదు కొన్ని షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఈటీవీ ప్లస్ లో నా షో నా ఇష్టం షో తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ షో తో చలాకి చంటి కి మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

Anasuya left suddenly knowing that Chalaki Chanti had a heart attack

అయితే గత కొద్ది రోజులుగా చలాకి చంటి కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే చలాకి చంటికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చలాకి చంటికి ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని సమాచారం. ఇటీవల చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చాక ఎక్కడ కనిపించలేదు. బిగ్బాస్ నుంచి బయటికి వచ్చాక చలాకి చంటి ఏ సినిమాలలో, ఏ షోలలో కనిపించలేదు.

Advertisement

చలాకి చంటికి గుండెపోటు వచ్చిందన్న విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు చలాకీగా ఉండే చలాకి చంటి ఇప్పుడు గుండెపోటు రావడంతో అందరూ షాకింగ్ కి గురవుతున్నారు. ఇక చలాకి చంటి పలు సినిమాలలో నటిస్తూ, బుల్లితెరపై కొన్ని షోలలో కూడా కనిపిస్తూ ఉంటాడు. జబర్దస్త్ తర్వాత చలాకి చంటికి నా షో నా ఇష్టం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ టైంలో ఈ షో సూపర్ గా సక్సెస్ఫుల్ అయింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి