Home » Entertainment » Anasuya Mesmarizing Looks
Entertainment

Anasuya : చిలిపిగా క‌వ్విస్తున్న అన‌సూయ‌.. మ‌తులు పోతున్నాయంటున్ నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 2, 2022, 3:30 pm
Advertisement

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు యాంక‌ర్‌గా బాగా పాపుల‌ర్ కాగా, వెండితెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. `జబర్దస్త్` షోకి హోస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ షో కోసం ఫోటో షూట్‌ చేస్తూ అభిమానులకు ప్రతి వారం గ్లామర్‌ విందుని వడ్డిస్తుంది. తాజాగా బ్లూ గౌన్‌లో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోస్తూ కిర్రాక్‌ పోజులిచ్చింది రంగమ్మత్త . ఆమె హాట్‌ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి.వెక్కిరిస్తున్నట్టుగా ఇచ్చిన పోజులతో కుర్రాళ్లని ఆటపట్టిస్తుంది. అల్లరి చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. అనసూయ ఈ లేటెస్ట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. ఆమె ఫాలోవర్స్ ని, నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.

Advertisement

కుర్రాళ్ల హార్ట్ బ్రేక్‌ చేస్తున్నాయి. అనసూయ బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. టీవీ షోస్‌ని రక్తికట్టిస్తుంది. అయితేగ్లామర్‌ షో కేవలం టీవీకే పరిమితమని, వెండితెరపై మాత్రం నటనకు ప్రయారిటీ ఇస్తానని చెప్పింది. ఇప్పుడు నటన పరంగా మరింత రక్తికట్టించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ఒకటి `వాంటెడ్‌ పండుగాడ్‌`. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో విష్ణు ప్రియా, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్‌ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పిల్లి కూడా కీలకపాత్ర పోషిస్తుంది.

anasuya mesmarizing looks

Advertisement

Anasuya : అన‌సూయ అద‌ర‌హో..

మొత్తంగా టీవీ యాక్టర్స్ తో చేస్తున్న చిత్రమిది. అనసూయ `పుష్ప2`లో ద్రాక్షాయణిగా నటిస్తుంది. అలాగే `రంగమార్తాండ`లో కీలక పాత్ర పోసిస్తుంది. `దర్జా` చిత్రంలో నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌ చేస్తుంది.`సింబా` అనే చిత్రంలో న్యాయం కోసం పోరాడే మహిళగా కనిపించబోతుంది. దీంతోపాటు ఇటీవల తన 35వ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమాని ప్రకటించింది అనసూయ. అలాగే తమిళంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా విశేషంగా పాపులర్‌ అయిన అనసూయ మళ్లీ ఆ స్థాయి పాత్రలతో వెండితెరపై మ్యాజిక్‌ చేయాలనుకుంటుంది. ఇప్పటి వరకు అలాంటి పాత్ర పడలేదు. అదే సమయంలో తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తూ చాలా సెలక్టీవ్‌గా ఉంటుంది అనసూయ.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి