Vijay Devarakonda Vs Anasuya : విజయ్ దేవరకొండతో గొడవలపై అనసూయ మరోసారి కీలక వ్యాఖ్యలు..!!

Advertisement

Vijay Devarakonda Vs Anasuya : యాంకర్ అనసూయ గా కెరియర్ స్టార్ట్ చేసి బుల్లితెరపై ఇంకా వెండి తెర పై సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న గాని కుర్ర హీరోయిన్లకు కుర్ర యాంకర్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో అనసూయ సొంతం. సమాజంలో ఇంకా ఇండస్ట్రీలో అనేక విషయాలపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పే అనసూయ..కి గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ అభిమానులకి టాగ్ ఆఫ్ వార్ సోషల్ మీడియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “పెద్దకాపు” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అనసూయ ఇటీవల పాల్గొనడం జరిగింది. ఈ సినిమాలో చాలా వైవిద్యమైన పాత్ర పోషించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో గొడవలు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దేనికి అనసూయ సమాధానమిస్తూ.. ఇది శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా. ఆయన ఎప్పుడు గొడవలకు చాలా దూరంగా ఉంటూ రేలంగి మాదిరి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.

Advertisement
Anasuya Reacts On Vijay Devarakonda Comments Over Kushi Press Meet

అటువంటి ఆయన దర్శకత్వంలో నటించిన ఈ సినిమాలో.. ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను. వేరే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అయితే సమాధానం చెబుతాను. శ్రీకాంత్ అడ్డాల గారు ఎందుకంటే మనకి గొడవలు అన్న రీతిలో వ్యవహరించే వ్యక్తి. కనుక నేను ఏమీ ఇబ్బంది పెట్టను వేరే చోట అడగండి చెబుతాను అంటూ అనసూయ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

Advertisement
Advertisement