Home » Entertainment » Anasuya Remuneration For Pushpa Movie Part One
Entertainment

Anasuya : అనసూయ మామూల్ది కాదు.. 5 నిమిషాలు కూడా కనిపించలేదు కానీ.. పుష్ప పార్ట్ 1కి ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: December 25, 2021, 4:40 pm
Advertisement

Anasuya : ప్రస్తుతం పుష్ప సినిమానే  ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తోంది. ముఖ్యంగా పుష్ప సినిమాలో నటించిన అనసూయకు మంచి మార్కులు పడలేదు. ఈ సినిమాలో అందరి గెటప్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే. హీరో అల్లు అర్జున్ దగ్గర్నుంచి.. విలన్స్ వరకు ప్రతి ఒక్కరి గెటప్ చాలా కొత్తగా, వింతగా ఉంటుంది. అందుకే.. ఈ సినిమా సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది.అయితే.. ఈ సినిమాలో అనసూయ పాత్రపై కాస్త అభిమానులు చివుక్కుమంటున్నారు. ఏంటి ఆ డ్రెస్సు.. ఏంటి ఆ అవతారం.

Advertisement

సినిమాలో కనిపించే 5 నిమిషాల పాత్ర కోసం.. అంత బిల్డప్ ఎందుకో అంటూ అనసూయపై నెటిజన్లు ఫైర్ అయిన విషయం తెలిసిందే.అయితే.. తన పాత్ర గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ తో పాటు.. ప్రస్తుతం పుష్ప పార్ట్ 1లో తను చేసిన ఆ ఐదు నిమిషాల నిడివి గల పాత్రకు తను భారీ పారితోషికమే అందుకుందట. అవును.. తను భారీగానే రెమ్యునరేషన్ పొందినట్టు తెలుస్తోంది.ఈ సినిమా కోసం అనసూయ కేవలం 10 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చిందట. రోజుకు 1.5 లక్షలు డిమాండ్ చేసిందట.

anasuya remuneration for pushpa movie part one

Advertisement

Anasuya : 5 నిమిషాల పాత్రకే అంత తీసుకుంటే.. పార్ట్ 2 రెమ్యునరేషన్ ఎంతో?

అంటే.. 10 రోజులకు కనీసం 12 లక్షల నుంచి 15 లక్షల వరకు మూవీ యూనిట్ ముట్టజెప్పారట. సినిమా మొత్తం చూస్తే తనది చాలా చిన్నపాత్ర. అంతగా కథను మలుపు తిప్పే పాత్ర కూడా కాదు. అయినప్పటికీ.. తనకు అంత భారీ పారితోషికం ఇచ్చి మరీ.. సుకుమార్ ఎందుకు తనను సినిమాలో పెట్టుకున్నట్టు అని సినీ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.అయితే.. సెకండ్ పార్ట్ లో మాత్రం అనసూయకు మంచి క్యారెక్టర్ ఉందట. తన తమ్ముడిని పుష్ప చంపినందుకు.. పుష్ప భార్య శ్రీవల్లిపై దాక్షాయిణి పగ తీర్చుకునేలా సుకుమార్ సీన్లు రాసుకున్నట్టు తెలుస్తోంది. మరి.. సెకండ్ పార్ట్ కు అనసూయ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి