Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గాను, నటిగాను అదరగొడుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తుంటుంది. ఇటీవల అనసూయ తన 37వ పుట్టినరోజును జరుపుకున్నారు. దీంతో ఆమెకు సెలెబ్రిటీస్‌తో పాటు సామాన్య నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. తన బర్త్ డే సందర్భంగా అనసూయ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనసూయ తెలుగులో టాప్ యాంకర్స్‌లో ఒకరుగా రాణిస్తున్నారు. అంతేకాదు సినిమాల్లోను మెరుస్తున్నారు. ఇక ఆమె పర్సనల్ విషయాల గురించి వస్తే… అనసూయ 2008లో భద్రుక కాలేజ్ నుండి ఎం.బి.ఎ చేశారు.
ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు అనసూయ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్ గా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అనసూయ భరద్వాజ్. ఈ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు అనసూయ అందాల ఆరబోత కూడా జబర్దస్త్ షోను మరో స్థాయికి తీసుకెళ్లింది.అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తూ వస్తోంది. గ్లామర్ షోలోనూ వెనకాడకుండా వెండితెరపై కనిపించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
ఇందుకు ‘విన్నర్, ఎఫ్2, చావు కబురు చల్లగా’చిత్రాల్లో కొన్ని స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది.పుష్పలోను దాక్షాయణిగా మెప్పించింది అనసూయ. తెలుగులో టాప్ యాంకర్‌లలో ఒకరుగా కొనసాగుతోన్న అనసూయ ఒక్కో షోకి రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుంటారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్న యాంకర్ అనసూయ మరో సినిమాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అనసూయ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో ఓ సినిమాలో నటించనుందని సమాచారం
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.