Rashmi Gautam : అమ్మల్ని, అక్కల్ని ఎందుకు తిడతారు.. యాంకర్ రష్మీ ఆవేదన

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 14, 2021, 7:00 am

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam సోషల్ మీడియాలో ఎంత బాధ్యతాయుతంగా ప్రవరిస్తుంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలో ఎక్కడ ఎలాంటి అమానవీయ ఘటనలు జరిగినా స్పందిస్తుంటుంది. మూగ జీవ హింసను ఖండిస్తుంటుంది. అలాంటి రష్మీ తాజాగా తీవ్ర ఆవేదనకు గురైంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనపై రష్మీ ఆవేదన చెందింది. మనుషులుగా మనం చచ్చిపోయాం అని చెప్పుకొచ్చింది. ఇక మూగ జీవాలను హింసించడంపైనా స్పందించింది.

Anchor rashmi Gautam About Women

Anchor rashmi Gautam About Women

మారాలనుకుంటే అలా చేయండి.. Rashmi Gautam

ఎద్దుల బండి గురించి మనం వినే ఉంటాం. వాటిలో మోతాదుకు మించి బరువును పెట్టారు. ఎద్దులు నానా కష్టపడి బండిని లాగుతున్నాయి. వాటిపైనా రష్మీ కరుణను చూపించింది. ఇది మరీ అన్యాయం.. అవి మెయగలిగేంత బరువును పెట్టొచ్చు కానీ మరి ఇలా చేయకూడదు అని తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. అయితే రష్మీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు కనిపిస్తోంది. అమ్మల్ని, అక్కల్ని మధ్యలోకి లాగుతూ ట్రోల్ చేసినట్టున్నారు.

 

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo

దీంతో రష్మీ తీవ్రంగా ఆవేదన చెందింది. మీరు ఈ సమాజాన్ని మార్చాలిన భావిస్తే.. ముందు మీరు తిట్లను ఆపేయండి..మీరు ఎప్పుడైనా కానీ ఆలోచించారా? ఈ తిట్లలో ఎప్పుడూ కూడా అమ్మ, అక్కాచెల్లెల్ని లాగుతుంటారు. మీరు గనుక మహిళకు గౌరవం ఇద్దామని అనుకుంటే.. ఇక్కడి నుంచి మొదలుపెట్టండి.. మీరు ఎలాంటి వాళ్లైనా సరే ఇకపై అమ్మ, అక్కా, చెల్లెళ్లు, అమ్మాయిలను దూషించకుండా ఉండండి అని రష్మీ సలహాలు ఇచ్చింది.

 

Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee

Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp