Indraja : “పిలిచి మరీ అవమానిస్తారా?”.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 15 July 2026, 7:00 am
  •  Indraja : "పిలిచి మరీ అవమానిస్తారా?".. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీ..!

Indraja  : తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ Jabardasth తర్వాత కామెడీ షోల ట్రెండ్ మరింత పెరిగింది. ప్రేక్షకులను నవ్వించేందుకు కమెడియన్లు చేసే పంచ్‌లు, సెటైర్లు, స్పూఫ్‌లు కొన్నిసార్లు నవ్వులు పంచితే.. మరికొన్ని సందర్భాల్లో వివాదాలకు కూడా కారణమవుతుంటాయి. ముఖ్యంగా ETVలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ Sridevi Drama Company షోలో ప్రతి వారం కొత్త థీమ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన Sridevi Drama Company Promo మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ప్రోమోలో కమెడియన్ బుల్లెట్ భాస్కర్ Bullet Bhaskar ఫైమా Faima కలిసి చేసిన స్కిట్‌పై జడ్జి ఇంద్రజ Indraja అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. రాబోయే ఆషాడ మాసం Ashada Masam సందర్భంగా “ఆషాడం పెళ్లికొడుకులు” అనే ప్రత్యేక థీమ్‌తో ఈ వారం Sridevi Drama Company ఎపిసోడ్‌ను రూపొందించారు. బుల్లితెర సెలబ్రిటీలు, కమెడియన్లు, యాంకర్ రష్మి గౌతమ్ Rashmi Gautam కలిసి సందడి చేసిన ఈ ఎపిసోడ్‌లో పలు వినోదాత్మక స్కిట్లు ఆకట్టుకున్నాయి. షో ప్రారంభంలోనే కుటుంబ నేపథ్యంతో సాగిన కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించగా, మధ్య మధ్యలో హైపర్ ఆది Hyper Aadi వేసిన పంచ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో జడ్జి ఇంద్రజ కూడా తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు.

Indraja : "పిలిచి మరీ అవమానిస్తారా?".. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీ..!

Indraja : “పిలిచి మరీ అవమానిస్తారా?”.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీ..!

Indraja  బుల్లెట్ భాస్కర్ కామెడీ.. ఫైమా స్కిట్‌కు మంచి స్పందన

ఆషాడం స్పెషల్ సందర్భంగా బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్ ఇద్దరూ బట్టల షాపు యజమానులుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకరు 25 శాతం, మరొకరు 50 శాతం డిస్కౌంట్ అంటూ వినోదభరితంగా స్కిట్‌ను ప్రారంభించారు. ఒక కస్టమర్ తన భార్య తన మాట వినేలా చేసే చీర కావాలని అడగడంతో, “అలాంటి చీర ఉంటే ముందు నేనే కొనేస్తాను” అంటూ Bullet Bhaskar చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఆ తర్వాత పటాస్ ప్రవీణ్ భార్య వంశీత పాత్రలో వచ్చిన సన్నివేశంలో కూడా ఫైమాపై వేసిన పంచ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

టాస్క్‌లు, డ్యాన్స్‌లతో సందడి

ఈ ఎపిసోడ్‌లో కామెడీతో పాటు పలు వినోదాత్మక గేమ్స్ కూడా నిర్వహించారు. రష్మి గౌతమ్ ఇచ్చిన గోరింటాకు టాస్క్‌లో హైపర్ ఆది తనదైన స్టైల్‌లో పంచ్‌లు పేల్చగా, స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగింది. మరో గేమ్‌లో బస్తాలోకి దూరి పాకుతూ గోల్ చేయాల్సిన టాస్క్‌లో Bullet Bhaskar, Hyper Aadi ఇద్దరూ మధ్యలోనే ఓడిపోవడం కూడా ప్రేక్షకులను అలరించింది. ఇంద్రజ జీవితాన్ని స్పూఫ్ చేసిన స్కిట్.. అక్కడే మొదలైన అసహనం ఎపిసోడ్ చివర్లో ఫైమా జడ్జి ఇంద్రజ గతంలో చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను అనుకరిస్తూ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత Bullet Bhaskar, Faima కలిసి ఇంద్రజ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను స్పూఫ్ చేస్తూ కామెడీ చేశారు. రాత్రి 10 గంటలకు నిద్రపోయే అలవాటుపై సరదా డైలాగులు,  చెన్నై ఇంటి గురించి చేసిన వ్యాఖ్యలు, పాలవాడు, కూరగాయల వ్యాపారి వంటి అంశాలపై చేసిన పంచ్‌లు కొంతమందికి వినోదంగా అనిపించినా, జడ్జి Indraja మాత్రం అసహనం వ్యక్తం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. “పిలిచి మరీ ఇలా అవమానించడం కరెక్టేనా?” అంటూ ఇంద్రజ ప్రశ్న స్కిట్ ముగిసిన తర్వాత మాట్లాడిన ఇంద్రజ…

“మిమ్మల్ని ఒక్కటే అడగాలని ఉంది… పిలిచి మరీ ఇలా అవమానించడం కరెక్టేనా? ఒక్కసారి నా స్థానంలో మీరు ఉంటే ఎలా అనిపిస్తుందో ఆలోచించండి.” అని వ్యాఖ్యానించారు.

ఆమె ఇంకా…

“నేను లాగి లాగి మాట్లాడుతున్నానా?”
“ఎందుకు ఇలా పరువు తీస్తారు?”
“హ్యాపీగా షో చేయండి… నేను కూడా నవ్వుకోవాలి.”

అంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వినగానే స్టేజ్‌పై ఉన్న కమెడియన్లు, అతిథులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు ప్రోమోలో కనిపించింది. నిజంగానే హర్ట్ అయ్యారా..? లేక షోలో భాగమేనా?  ప్రస్తుతం ఈ Sridevi Drama Company Promo సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంద్రజ నిజంగానే బాధపడ్డారా..? లేక ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు షోలో భాగంగా ఈ సన్నివేశాన్ని రూపొందించారా..? అన్న ప్రశ్నలు నెటిజన్లలో చర్చకు దారి తీశాయి. ఇటీవలి కాలంలో టీవీ షోల ప్రోమోల్లో ఆసక్తికరమైన ట్విస్ట్‌లు చూపించి, పూర్తి ఎపిసోడ్‌కు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన కూడా అలాంటిదే కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే Sridevi Drama Company పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp