Rashmi Gautam: యాంకర్ రష్మీ లిప్ కిస్.. ‘జబర్దస్త్’ పిక్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 1, 2021, 11:46 am

Rashmi Gautam: యాంకర్ రష్మీ గురించి తెలియాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే. తెరపై కనిపించే రష్మీకి నిజ జీవితంలో ఉండే రష్మికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై గ్లామర్‌, అందాలను ప్రదర్శించినా కూడా సోషల్ మీడియాలో మాత్రం పద్దతిగా ఉంటుంది. ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శనకు తెరలేపలేదు. రష్మీలోని ఈ క్వాలిటీయే ఆమెకు ఇంతటి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఆమె మూగ జీవాల కోసం పాటు పడే తత్త్వాన్ని చూసి అందరూ ఫిదా అవుతుంటారు.

Anchor Rashmi Gautam Pic With Her pet

Anchor Rashmi Gautam Pic With Her pet

కరోనా, లాక్డౌన్ కాలంలో అందరూ తమ తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు.. పెంపుడు కుక్కల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే పుకారు రావడంతో ఎంతో మంది తమ పెట్స్‌ను రోడ్డున వదిలేశారు.. ఆ సమయంలోనూ రష్మీ స్పందించింది. అవన్నీ అవాస్తవాలు.. దయచేసి వాటిని అలా వదిలేయకండని కోరింది. అంతే కాకుండా మూగ జీవాలకు లాక్డౌన్ వల్ల ఆహారం ఏమీ దొరకడం లేదని తానే స్వయంగా రంగంలోకి దిగింది. బకెట్ పట్టుకుని రోడ్ల వెంట నడుస్తూ.. వీధి కుక్కలకు ఆకలిని తీర్చింది.

Rashmi Gautam: యాంకర్ రష్మీ లిప్ కిస్..

అలా రష్మీకి మూగ జీవాలంటే ప్రాణమని అందరికీ తెలిసి వచ్చింది. ఎక్కడ ఏ మూగ జీవి బాధపడ్డా కూడా రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి రష్మికి ఇంట్లో కొన్ని పెట్స్ ఉన్నాయి. వాటిని తన పిల్లల్లా చూసుకుంటుంది. తాజాగా తన పెట్‌తో రష్మీ ఆడుకుంది. అందులో తన పెట్‌కు రష్మీ, రష్మీ తన పెట్‌కు ముద్దులుపెట్టుకున్నారు. అందులో భాగంగా పెట్ లిప్ కిస్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp