Anchor Ravi తెల్లమొహం వేసిన రవి.. వీడియోతో యాంకర్ గుట్టురట్టు చేసిన నాగ్
Anchor Ravi : యాంకర్ రవి అడ్డంగా దొరికిపోయాడు. డెబ్బై కెమెరాల మధ్య అబద్దం ఆడితే ఇలానే ఉంటుంది. వెనకాల మాట్లాడటం తప్పు కాకపోయినా.. దాన్ని అంగీకరించాల్సిన సమయంలో అంగీకరించకపోతే ఇలానే ఉంటుంది. సింగిల్ మెన్ అనే పదాన్ని వాడావా? అని యాంకర్ రవిని ప్రియ, లహరి అడిగితే.. వాడలేదు అని చెప్పాడు. ఒట్టేసి మరీ చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. రవి ఆడిన ఈ నాటకంలో ప్రియ, లహరి బాధితులయ్యారు. లహరి గురించి చెడుగా చెప్పింది రవి. దాన్ని విని.. అర్దరాత్రి హగ్ బాత్రూం ఏరియా అంటూ ప్రియ నోరు జారింది.
Anchor Ravi Faces Humiliation In Bigg Boss 5 Telugu
అలా మొత్తానికి మూడో వారంలో ఎక్కువగా ప్రియ, లహరి, రవి చర్చనే జరిగింది. నామినేషన్ మొదటి రోజు అయిపోయాక ప్రియ మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎలా మాట్లాడతావ్ అంటూ ఓట్లు వేయమని చెబుతూ.. నానా రకాలుగా ట్రోల్ చేశారు. కానీ రవి మాట్లాడిన వీడియో బయటకు రావడంతో అసలు కథ అడ్డం తిరిగింది. రవి గుంటనక్కగా కరెక్ట్ అంటూ అందరూ ఆడిపోసుకున్నారు. ప్రియది తప్పులేదని అనుకున్నారు.
Anchor Ravi Faces Humiliation In Bigg Boss 5 Telugu
Anchor Ravi : యాంకర్ రవి ఇమేజ్ డ్యామేజ్
కానీ ఈ విషయం బిగ్ బాస్ ఇంట్లో తెలియదు. అందుకే నిన్న నాగ్ లహరి పవర్ రూంకి పిలిచి అసలు గుట్టు విప్పేశాడు. రవి మాట్లాడిన మాటలను ప్లే చేసి చూపించాడు.
Anchor Ravi Faces Humiliation In Bigg Boss 5 Telugu
అలా రవి మొహం మొత్తం తెల్లబోయింది. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. దీంతో నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో రవి సైలెంట్ అయిపోయాడు. మొహం మొత్తం వాచిపోయినట్టుంది. ఇక మున్ముందు అయినా ఇలా మాటాలు మార్చకుండా ఉంటాడా? లేదా? అన్నది చూడాలి. ఈ ఘటనతో రవి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది.
