Home » Entertainment » Anchor Ravi Feels Humiliation In Bigg Boss 5 Telugu
Entertainment

Anchor Ravi : తలెత్తుకోవడానికి సిగ్గుగా ఉంది.. పశ్చాత్తాపడ్డ యాంకర్ రవి

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 28, 2021, 7:44 pm
Advertisement

Anchor Ravi  యాంకర్ రవి Anchor Ravi భిన్న ధోరణి ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. కెమెరాలున్న సంగతి మర్చిపోయాడో ఏమో గానీ.. తాను మాట్లాడిన మాటలనే మార్చి చెప్పేశాడు. తాను అన్న మాటలనే అనలేదు అని మళ్లీ బుకాయించాడు. మొత్తానికి యాంకర్ రవి తన తప్పును తెలుసుకున్నాడు. లహరి విషయంలో తాను చేసిన తప్పుకు పశ్చాత్తాప్పడుతున్నాడు. ప్రియ, లహరి ఇద్దరికీ సారీ చెప్పేశాడు. అయితే యాంకర్ రవి సోమవారం నాటి ఎపిసోడ్‌లో వింతగా ప్రవర్తించాడు.

Advertisement

Anchor Ravi Feels Humiliation In Bigg Boss 5 Telugu

తలదించుకున్న యాంకర్ రవి Anchor Ravi

ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. ఆరోజు అంతా వేరే లోకంలో ఉన్నాను..అది ఎలా మాట్లాడానో నాకే తెలియడం లేదు.. అది మాట్లాడి కూడా మళ్లీ మాట్లాడ లేదు అని ఎలా అన్నాను.. పైగా అమ్మ మీద ఎలా ఒట్టు వేశాను అని షన్ను, సిరిలతో రవి తన బాధ చెప్పుకొచ్చాడు. కవర్ చేసే ప్రయత్నం చేసుకున్నాడు. అయితే యాంకర్ రవి రెండు రోజుల నుంచి మొత్తం డల్లుగా కనిపిస్తున్నాడు. మొహం మొత్తం వాడిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇక నామినేషన్‌లో తన బాధంతా వెల్లగక్కాడు.

Advertisement

bigg boss 5 telugu lobo fired on priya

నామినేషన్స్ మొదలుపెట్టేముందే యాంకర్ రవి అందరికీ ఓ విషయం చెప్పాడు. మీ ముందు తల ఎత్తుకోవాలంటే కూడా సిగ్గుగా ఉంది.. ముగ్గురికి సారీ చెప్పాలి.. ప్రియ, లహరి, మా అమ్మ.. అలా ఎలా మా అమ్మ మీద ఒట్టు వేశాను అని ఫీల్ అయ్యాడు. ప్రియకు, లహరికి క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఈ క్షమాపణలు, ఈ మాటలను జనాలు ఏ మేరకు అంగీకరిస్తారు అనేది చూడాలి. యాంకర్ రవి అసలే ఈ వారం కూడా నామినేషన్‌లలోకి వచ్చేశాడు. నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబో, యాంకర్ రవి, కాజల్, వీజే సన్నీ, ప్రియలు నామినేట్ అయ్యారు.

Advertisement

Bigg Boss 5 Telugu 4th Week Nominations List

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి