
Anchor Ravi out of the house
Anchor Ravi : దాదాపు మూడు నెలలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ -5 చివర దశకు వచ్చేస్తోంది. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు హౌస్ ను వీడగా ఈ రోజు రవి వంతు వచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఆదివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క మానస్ తప్ప మిగిలిన కంటెస్టెంట్లు అందరూ నామినేషనల్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యాంకర్ రవి అందర్నీ డామినేట్ చేస్తూనే ఉన్నాడు. అతను టాప్ -5లో కచ్చితంగా ఉంటాడని అందరూ అంచనా వేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఆయన చాలా సార్లు నామినేషన్ లో ఉన్నా ప్రతి సారి బయటపడుతూనే ఉన్నారు. దీంతో అతని మీద అంచనాలు బాగానే పెరిగిపోయాయి. పైగా హౌస్ లో ఉన్న వారిలో రవి కంటే పెద్ద స్టార్లు ఎవరూ లేరు. మిగతా అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వారు సీరియల్స్ లో వచ్చిన వారే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు రవి ఎలిమినేట్ అవుతున్నాడని తెలుస్తోంది. అదేంటి హౌస్లో వీక్ గా ఉన్న సిరి, కాజల్, ప్రియాంకలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా రవి పేరు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
Anchor Ravi out of the house
వారందరికీ రవి కంటే కూడా ఎక్కువగా ఓట్లు రావడంతో అతను ఎలిమినేట్ అవుతున్నట్టు సమాచారం. ఎందుకంటే రవి మీద మొదటి నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి. కావాలని మిగతా వారిని టార్గెట్ చేస్తున్నాడని, చీటింగ్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో నెటిజన్లు అతన్ని ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెగెటివ్ అతన్ని ముంచేసినట్టు తెలుస్తోంది. పైగా ఈ వ్యతిరేకతను తప్పించుకోవడానికి రవి కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో అదే అతన్ని ఎలిమినేట్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు. రవి చేస్తున్న ప్రయత్నాలు అతన్ని గండం నుంచి బయటపడేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్లడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్తో…
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…
This website uses cookies.