Anchor Ravi : హౌస్ నుంచి ర‌వి ఔట్‌.. ఆ ప‌నులే కొంప ముంచాయా..

Authored By mallesh | The Telugu News | Published on: November 28, 2021, 5:40 pm

Anchor Ravi : దాదాపు మూడు నెల‌లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ -5 చివ‌ర ద‌శ‌కు వ‌చ్చేస్తోంది. ఇప్ప‌టికే చాలామంది కంటెస్టెంట్లు హౌస్ ను వీడ‌గా ఈ రోజు ర‌వి వంతు వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తి ఆదివారం ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ రోజు కూడా ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క మాన‌స్ త‌ప్ప మిగిలిన కంటెస్టెంట్లు అంద‌రూ నామినేష‌న‌ల్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యాంక‌ర్ ర‌వి అంద‌ర్నీ డామినేట్ చేస్తూనే ఉన్నాడు. అత‌ను టాప్ -5లో క‌చ్చితంగా ఉంటాడ‌ని అంద‌రూ అంచనా వేస్తూనే ఉన్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న చాలా సార్లు నామినేష‌న్ లో ఉన్నా ప్ర‌తి సారి బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు. దీంతో అత‌ని మీద అంచ‌నాలు బాగానే పెరిగిపోయాయి. పైగా హౌస్ లో ఉన్న వారిలో ర‌వి కంటే పెద్ద స్టార్లు ఎవ‌రూ లేరు. మిగ‌తా అంద‌రూ కూడా సోష‌ల్ మీడియా ద్వారా వెలుగులోకి వ‌చ్చిన వారు సీరియ‌ల్స్ లో వ‌చ్చిన వారే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ర‌వి ఎలిమినేట్ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. అదేంటి హౌస్లో వీక్ గా ఉన్న సిరి, కాజ‌ల్‌, ప్రియాంక‌లో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. కానీ అనూహ్యంగా ర‌వి పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Anchor Ravi out of the house

Anchor Ravi out of the house

Anchor Ravi :  వీక్ గా ఉన్న వారికి ర‌వి కంటే ఎక్కువ ఓట్లు..

వారంద‌రికీ ర‌వి కంటే కూడా ఎక్కువ‌గా ఓట్లు రావ‌డంతో అత‌ను ఎలిమినేట్ అవుతున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే ర‌వి మీద మొద‌టి నుంచి కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. కావాల‌ని మిగ‌తా వారిని టార్గెట్ చేస్తున్నాడ‌ని, చీటింగ్ చేస్తున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో నెటిజ‌న్లు అత‌న్ని ట్రోలింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నెగెటివ్ అత‌న్ని ముంచేసిన‌ట్టు తెలుస్తోంది. పైగా ఈ వ్య‌తిరేక‌త‌ను త‌ప్పించుకోవ‌డానికి ర‌వి కూడా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డంతో అదే అత‌న్ని ఎలిమినేట్ అయ్యేలా చేసింద‌ని చెబుతున్నారు. ర‌వి చేస్తున్న ప్ర‌య‌త్నాలు అత‌న్ని గండం నుంచి బ‌య‌ట‌ప‌డేయలేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

mallesh

No bio available for this author.

  1. "410 Million Mars Meteorite : భూమిపై పడిన 410 కోట్ల ఏళ్ల నాటి మార్స్ రాయి.. అంగారకుడిపై జీవం ఉందా..?"

  2. "Rapido Driver : నువ్వు సూప‌ర్ గురూ.. ర్యాపిడో పార్సిల్‌లో బంగారం పంపితే.. నగలతో డ్రైవర్ జంప్‌..!"

  3. "Adarsha Kutumbam : వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’కు కాపీరైట్ చిక్కులు.. అసలేం జరిగింది..?"

  4. "Breakup : మూడేళ్ల ప్రేమకు ముగింపు.. స్టార్ హీరో కొడుకుతో ఆ హీరోయిన్ కూతురు లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్..!"

  5. "Vijayawada Mayor Election : విజయవాడ మేయర్ పోరు రసవత్తరం.. కూటమి, వైసీపీకి ఏబీవీ సవాల్!"

  6. "10th New Rules : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్!"

  7. "YS Sharmila : యలహంక ఇల్లు నాదే.. జగన్‌కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్.. ఆస్తుల వివాదంపై కీలక ట్వీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp