Anchor Ravi : ప్రస్తుతం స్కూల్ సీజన్ మొదలైంది. పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయి. పిల్లలు స్కూల్‌కు రెడీ అవుతుంటారు. కొందరేమో స్కూల్‌కు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరు స్కూల్‌కు వెళ్లనంటూ మారాం చేస్తుంటారు. ఇక తల్లిదండ్రులు అయితే పిల్లల స్కూల్ కోసం అన్నీ రెడీ చేస్తుంటారు. పుస్తకాలు, యూనిఫామ్స్ అంటూ షాపింగ్‌లతో బిజీగా మారుతుంటారు. అలా ఏ తండ్రైనా కూడా ఈ సీజన్‌లో మాత్రం తమ పిల్లల కోసం ఇలానే తిరుగుతుంటారు. కష్టపడుతుంటారు. తాజాగా యాంకర్ రవి సైతం ఇలాంటి పనుల్లోనే బిజీగా మారిపోయాడు.
తాను ఎంత పెద్ద యాంకర్ అయినా, ఎంత బిజీగా ఉన్నా కూడా కూతురికి మాత్రం తండ్రే. తన పాప వియా కోసం రవి ఇప్పుడు సాధారణ తండ్రిలా మారిపోయాడు. పుస్తకాలకు అట్టలు వేస్తూ ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడు. చిన్నతనంలో ఇలాంటివి అందరికీ గుర్తుండే ఉంటాయి. అందుకే తన పాప కోసం రవి.. ఇప్పుడు ఇలా మారిపోయాడు. పుస్తకాలకు అట్టలు వేస్తుంటే.. వియా ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. మొత్తానికి రవి మాత్రం మొన్నటి వరకు న్యూ యార్క్‌లో బాగానే ఎంజాయ్ చేసి వచ్చాడు. తన ఫ్యామిలీతో కలిసి అక్కడ హంగామా చేసి వచ్చాడు. అసలే అది ప్రొఫెషనల్ టూర్. అయినా కూడా దాన్ని ఫ్యామిలీ వెకేషన్‌గా మార్చుకున్నాడు.
నాటా వారు యాంకర్ రవి, సుమలతో ఓ ప్రోగ్రాం చేయడం.. అక్కడే వారిని సన్మానించడం అందరికీ తెలిసిందే. అలా న్యూయార్క్‌లో ఓ వారం ఉండి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం అక్కడ బాగానే ఎంజాయ్ చేసింది. ఇక ఇక్కడకు వచ్చీ రాగానే ఇలా తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. రవి ఈ వీకెండ్‌లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా ఈ న్యూయార్క్ ట్రిప్, వాటికి సంబంధించిన విషయాల గురించే ప్రశ్నలు అడిగారు. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించేశాడు యాంకర్ రవి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.