Anchor Ravi : ఓ నార్మల్ తండ్రిలా మారిపోయాడు.. వియా కోసం యాంకర్ రవి కష్టాలు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 14, 2022, 1:30 pm

Anchor Ravi : ప్రస్తుతం స్కూల్ సీజన్ మొదలైంది. పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయి. పిల్లలు స్కూల్‌కు రెడీ అవుతుంటారు. కొందరేమో స్కూల్‌కు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరు స్కూల్‌కు వెళ్లనంటూ మారాం చేస్తుంటారు. ఇక తల్లిదండ్రులు అయితే పిల్లల స్కూల్ కోసం అన్నీ రెడీ చేస్తుంటారు. పుస్తకాలు, యూనిఫామ్స్ అంటూ షాపింగ్‌లతో బిజీగా మారుతుంటారు. అలా ఏ తండ్రైనా కూడా ఈ సీజన్‌లో మాత్రం తమ పిల్లల కోసం ఇలానే తిరుగుతుంటారు. కష్టపడుతుంటారు. తాజాగా యాంకర్ రవి సైతం ఇలాంటి పనుల్లోనే బిజీగా మారిపోయాడు.

తాను ఎంత పెద్ద యాంకర్ అయినా, ఎంత బిజీగా ఉన్నా కూడా కూతురికి మాత్రం తండ్రే. తన పాప వియా కోసం రవి ఇప్పుడు సాధారణ తండ్రిలా మారిపోయాడు. పుస్తకాలకు అట్టలు వేస్తూ ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడు. చిన్నతనంలో ఇలాంటివి అందరికీ గుర్తుండే ఉంటాయి. అందుకే తన పాప కోసం రవి.. ఇప్పుడు ఇలా మారిపోయాడు. పుస్తకాలకు అట్టలు వేస్తుంటే.. వియా ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. మొత్తానికి రవి మాత్రం మొన్నటి వరకు న్యూ యార్క్‌లో బాగానే ఎంజాయ్ చేసి వచ్చాడు. తన ఫ్యామిలీతో కలిసి అక్కడ హంగామా చేసి వచ్చాడు. అసలే అది ప్రొఫెషనల్ టూర్. అయినా కూడా దాన్ని ఫ్యామిలీ వెకేషన్‌గా మార్చుకున్నాడు.

Anchor Ravi preparation for viya school openings

Anchor Ravi preparation for viya school openings

నాటా వారు యాంకర్ రవి, సుమలతో ఓ ప్రోగ్రాం చేయడం.. అక్కడే వారిని సన్మానించడం అందరికీ తెలిసిందే. అలా న్యూయార్క్‌లో ఓ వారం ఉండి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం అక్కడ బాగానే ఎంజాయ్ చేసింది. ఇక ఇక్కడకు వచ్చీ రాగానే ఇలా తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. రవి ఈ వీకెండ్‌లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా ఈ న్యూయార్క్ ట్రిప్, వాటికి సంబంధించిన విషయాల గురించే ప్రశ్నలు అడిగారు. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించేశాడు యాంకర్ రవి.

Anchor Ravi preparation for viya school openings

Anchor Ravi preparation for viya school openings

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp