Home » Entertainment » Anchor Ravi Sensational Comments On Bigg Boss 5 Winner News Going Viral In Social Media
Entertainment

Anchor Ravi : బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన యాంకర్ రవి.. అందరూ అనుకుంటున్నట్లు సన్నీ కాదట..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 14, 2021, 8:20 pm
Advertisement

Anchor Ravi : బిగ్ బాస్ 5 తెలుగు సీజన్  ముగింపుకు ఇంకో 5 రోజులే మిగిలి ఉంది. శ్రీ రామ చంద్ర, సన్నీ, షన్ను, సిరి, మానస్ టాప్ 5 రేసులో మిగలగా.. ఈసారి ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. అభిమానులు పోటా పోటీగా ఓట్లు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మరియు నెటిజన్ల ప్రకారం.. సన్నీ లేదా షణ్ముఖ్ ఇద్దరిలో ఒకరు విన్నర్ గా నిలుస్తారని ప్రచారం జరుగుతుండగా.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన యాంకర్ రవి విన్నర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.టాప్ సెలబ్రిటీ హోదాలో హౌజ్ లోకు ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి…

Advertisement

విన్నర్ అవుతాడని అంతా భావించారు. అయితే టాప్ 5 లోకి కూడా ఎంట్రీ ఇవ్వకుండానే అనూహ్యంగా ఆయన హౌజ్ నుంచి నిష్క్రమించారు. ఇదిలా ఉండగా రవి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ పై చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. టాప్ 5 కంటెస్టెంట్లందరికీ విన్నర్ అయ్యే అర్హత ఉందన్న రవి… అయితే శ్రీరామచంద్రకు మాత్రమే టైటిల్ గెలిచే సత్తా ఉందని అన్నాడు. రవితో పాటు గత 6 వారాలుగా ఎలిమినేట్ అవుతూ వచ్చిన వారిలో అధిక శాతం మంది శ్రీ రామ చంద్రనే గెలుస్తాడని అంటున్నారు.అయితే బయట పలు అన్ అఫిషియల్ ఓటింగ్ వెబ్ సైట్లలో చూస్తే మాత్రం..

Anchor Ravi sensational comments on Bigg Boss 5 winner news going viral in social media

Advertisement

Anchor Ravi : శ్రీ రామే విన్నర్ అంటున్న యాంకర్ రవి..:

వీజే సన్నీ అందరికంటే ముందంజ లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో షన్ను, అనంతరం శ్రీ రామ్ కొనసాగుతున్నారు. మానస్, సిరి నాలుగు, ఐదు స్థానాలకు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం ఓట్లతో దాదాపు 52 శాతం ఓట్లు సన్నీకి పడుతుండగా… మిగిలిన ఓట్లు షణ్ముఖ్, సిరి, మానస్, శ్రీరామ్‌లకు షేర్ అవుతున్నాయి. అయితే ఏ పోల్ చూసుకున్నా.. సన్నీ టాప్ గేర్‌లో దూసుకు పోతుండటం గమనార్హం. అయితే బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి… ఓటింగ్ సరళి ఏ క్షణం లోనైనా మారవచ్చు. ఏది ఏమైనప్పటికీ విన్నర్ ఎవరో తేలాలంటే మరొక 5 రోజులు వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి