Home » Entertainment » Anchor Shiva Fun With Ariyana Glory In Insta Chit Chat
Entertainment

Ariyana : ఫ్రీగా ఉంటే బయకుపోదామన్న యాంకర్ శివ.. అరియానా రియాక్షన్ ఇదే

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 30, 2022, 6:30 pm
Advertisement

Ariyana : అరియానా, యాంకర్ శివలు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోతో మరింత దగ్గరయ్యారు. యాంకర్ శివ తాజాగా అరియానాను బయటకు పోదామని అడిగేశాడు. అరియానా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఇన్ స్టా స్టోరీలో ఆమె తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఏమైనా అడగండి.. ఆన్సర్ చెప్తాను అని అనేసింది. దీంతో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అందులో కొందరు ఆమె చర్మ సౌందర్య రహస్యం అడిగారు.. ఇంకొందరు హెయిర్ కెర్ గురించి అడిగారు.. బిగ్ బాస్ జర్నీ గురించి అడిగారు.. ఇలా అందరూ ఇష్టమొచ్చిన ప్రశ్నలు సంధించారు.

Advertisement

మీరు మాకు ఎంతో ఇష్టం.. స్పూర్తి నింపారు.. మీరే మాకు ఇన్‌స్పిరేషన్ అంటూ.. ఇలా పొగిడేశారు.. మొత్తానికి అరియానా మాత్రం తన అభిమానులు కామెంట్లు చూసి ఉప్పొంగిపోయింది. ఈ చాటింగ్‌లోకి యాంకర్ శివ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అరియానాతో మాట్లాడేశాడు.అరియానా ఆ ప్రశ్నను బయటపెట్టేసింది. ఫ్రీగా ఉన్నావా? ఉంటే బయటకు పోదాం అని అడిగేశాడు యాంకర్ శివ. దానికి అరియానా ఆశ్చర్యపోయినట్టుంది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి.. ఎక్కడికి పోదాంరా అని అనేసింది. మొత్తానికి ఈ ఇద్దరూ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మరీ అంత క్లోజ్ అవ్వలేదు.

Anchor Shiva fun with Ariyana glory in insta chit chat

Advertisement

కానీ బయటకు వచ్చాక మాత్రం యాంకర్ శివ అరియానా అషూ రెడ్డి ఇలా అందరూ బాగానే కలిసి పోయారు. అందరూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. యాంకర్ శివకు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మంచి ఇమేజ్ వచ్చింది. బిందు మాధవితో స్నేహం యాంకర్ శివకు కలిసి వచ్చింది. ఇక అతను ఆటను ఆడే తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ తరువాత యాంకర్ శివ జీవితం ఏదో మారిపోతోందని అందరూ అనుకున్నారు. కానీ మిగతా కంటెస్టెంట్ల మాదిరిగానే యాంకర్ శివ సైలెంట్ అయిపోయాడు. ఎక్కడా కనిపించడం లేదు. యాంకర్ శివ ఇప్పుడు కొత్తగా ఏమీ చేయడం లేనట్టు కనిపిస్తోంది. ఇక అషూ, అజయ్, స్రవంతి వంటి వారు అయితే గోవా బీచుల్లో హంగామా చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి