RGV – Anchor Shyamala : యాంకర్ శ్యామలపై ఆర్జీవీ సీరియస్.. స్టేజ్ మీదే ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు?
RGV – Anchor Shyamala : ఆర్జీవీ లేదా రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జీవీని చూసి తనలా గొప్ప డైరెక్టర్ అవ్వాలని కలలు కని ఇండస్ట్రీకి ఎందరో వచ్చి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్లు అయిన వాళ్లూ ఉన్నారు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ మధ్య ఆయన తీసే సినిమాలు ఆడటం లేదు కానీ.. ఒకప్పుడు ఆర్జీవీకి ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. అంతే కాదు.. ఆయన చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్. తన మనసులో ఏముంటే అది చెప్పేస్తాడు. లోపల ఒక మాట.. బయట ఒక మాట మాట్లాడడు. తాజాగా ఆర్జీవీ యాంకర్ శ్యామలపై సీరియస్ అయ్యాడు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అమ్మాయి అ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇది పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఈ సినిమాలో పూజా భలేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వాళ్లందరికీ థాంక్స్ చెబుతూ ఆర్జీవీ మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లబోతుండగా.. యాంకర్ శ్యామల… ఆర్జీవిని పిలిచి సార్ చిన్న రిక్వెస్ట్ అంటూ పిలిచింది. మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా రూపొందిన కొన్ని సినిమాల పేర్లను చెప్పండి అంటూ ప్రశ్నించింది శ్యామల.

anchor shyamala and rgv controversy at ammayi movie pre release event
RGV – Anchor Shyamala : వెంటనే స్టేజ్ దిగి వెళ్లిపోయిన వర్మ
దీంతో ఆర్జీవీకి కోపం వచ్చింది. నేను చాలా ఎమోషనల్ గా ఉన్నా ఇప్పుడు. ఇది చాలా సీరియస్ సినిమా అంటూ కోపంగా చెప్పి మైక్ తనకు ఇచ్చేసి స్టేజ్ దిగేసి వెళ్లిపోయాడు వర్మ. ఆయన ఆసక్తికరంగా సమాధానాలు చెబుతారని అడిగాను కానీ.. ఇలా అవుతుందని అనుకోలేదు. దానికి సారీ అంటూ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఆర్జీవీ.. యాంకర్ శ్యామలను పొగిడాడు. కానీ.. ఇప్పుడు మాత్రం తనపై సీరియస్ అయ్యాడు. అప్పుడు పొగిడి ఇప్పుడు సీరియస్ అవడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.