Home » Entertainment » Anchor Sowmya And Judge Indraja Squirrel In Jabardasth
Entertainment

Anchor Sowmya – Indraja : స్టేజ్ పై గొడవ పెట్టుకున్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య – జడ్జ్ ఇంద్రజ .. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 24, 2023 11:41 pm
Advertisement

Anchor Sowmya – Indraja : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ ఇటీవల ప్రేక్షకులను అంతగా అలరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు అత్యధిక టీఆర్పీ రేటింగ్ లతో దూసుకెళ్లిన జబర్దస్త్ ఇప్పుడు డల్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అంతకుముందు జబర్దస్త్ లో అనసూయ, నాగబాబు, రోజా, కమెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వీళ్లంతా షోను సక్సెస్ ఫుల్ గా నడిపించారు. వీళ్లంతా వెళ్లిపోవడంతో జబర్దస్త్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది.

Advertisement

Anchor Sowmya and judge Indraja squirrel in jabardasth

అయితే కొన్నిసార్లు డైరెక్టర్లు కాంట్రవర్సీ, డ్రామా క్రియేట్ చేస్తూ హైప్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీం లీడర్స్ గొడవ పడడం, కమెడియన్స్ స్టేజ్ వెళ్లిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు యాంకర్, జడ్జిల మధ్య చిన్న గొడవ పెట్టినట్లు కనిపిస్తోంది. తాజా ప్రోమో చూస్తే యాంకర్ సౌమ్య ఇంద్రజను హర్ట్ చేసినట్లు కనిపిస్తుంది. శ్రీరామనవమి వేడుకని జబర్దస్త్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. రాఘవల తాగుబోతు రమేష్ వేర్వేరు పానకాలనీ తయారు చేశారు.

Advertisement

వాటిలో ఏది బాగుందో చెప్పాలని యాంకర్ సౌమ్య ఇంద్రజ ను అడిగిందీ. ఆమె టేస్ట్ చూసి రాఘవది బాగుంది అని చెబుతుంది. యాంకర్ సౌమ్య మాత్రం తాగుబోతు రమేష్ , వెంకీ టీంది బాగుందని, ఓసారి టేస్ట్ చూడండి అని అడిగింది. అయినా సరే రాఘవగారు చేసింది బాగుంది అని ఇంద్రజ అంటుంది. ఆ తర్వాత సౌమ్య స్టేజిపై ఉన్న వాళ్ళందరిని టేస్ట్ చూడమని అడుగుతుంది. దీంతో ఇంద్రజ హర్ట్ అయిపోతుంది. ఇంతమంది ఒపీనియన్ తీసుకున్నట్లయితే నన్ను ఎందుకు అడిగారు, ఇది కరెక్ట్ కాదు అని సౌమ్య పై సీరియస్ అయింది. రాఘవ స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నట్లు ప్రోమో ని ఎండ్ చేశారు.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి