Home » Entertainment » Anchor Suma Comments On Lasya Couple In Cash Latest Promo
Entertainment

Anchor Suma : యాంకర్‌ల మొగుళ్ల బతుకంతే!.. సుమ కామెంట్లు వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 28, 2021, 11:00 am
Advertisement

Anchor Suma : బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం క్యాష్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే జనవరి 1వ తేదీ ఈ కార్యక్రమానికి లవ్లీ కపుల్స్ వచ్చి ప్రేక్షకులకు తమదైన శైలిలో వినోదాన్ని అందించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి సుమ ఆ జంటలను ఆహ్వానించారు.

Advertisement

యాంకర్ సుమ లాస్య, మంజునాథ్ దంపతులను వేదికపైకి ఆహ్వానించింది. ఇలా వేదికపైకి వచ్చిన ఈ జంటతో సుమ మాట్లాడుతూ 2022 వ సంవత్సరం ఎలా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు అంటూ అడగడంతో మంజునాథ్ ఏదో చెప్పబోతూ ఉండగా అంతకంటే ముందు లాస్య వారి ప్లాన్స్ చెప్పబోయింది. దీంతో సుమ ఛీ… నీ మీ ఆయన్ని మాట్లాడనివ్వు పాపం.. ఎప్పుడు చూసినా ఈ యాంకర్ల మొగ్గులకు మాట్లాడే అవకాశమే దొరకదు.. అంటూ సుమ యాంకర్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Anchor suma comments on lasya couple in cash latest promo

Advertisement

Anchor Suma : యాంకర్ల భర్తల బతుకు ఇంతే

ఇలా సుమ యాంకర్ లాస్య మాటలకు అడ్డు పడియాంకర్ల భర్తల బతుకులు ఎప్పుడు ఇంతే అంటూ లాస్య పరువు తీసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి వీరితో పాటు దేవత సీరియల్ హీరో అర్జున్ దంపతులు, శివ జ్యోతి దంపతులు, సీరియల్ ఆర్టిస్ట్ రోహిత్ దంపతులు వచ్చారు. నూతన ఏడాది సందర్భంగా సుమ వీరందరితో కలిసి ఎంతో సరదాగా తనదైన శైలిలో వీరిపై పంచులు వేస్తూ బాగా ఎంటర్టైన్ చేశారని తెలుస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి