
savings plan will give you good returns in the year 2022
Savings Plan : నూతన సంవత్సరం వస్తున్నది అనగానే ప్రతీ ఒక్కరు ఆ సంవత్సరంలో ఏయే పనులు చేస్తే బాగుంటుందని అనుకుంటుంటారు. అందుకుగాను సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటు ముందుకు సాగుతారు. రాబోయే రోజుల్లో అనగా భవిష్యత్తులో తమకు ఎటువంటి ఎకానమికల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకుగాను, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేందుకుగాను డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఈ క్రమంలోనే సంపాదించిన మనీలో కొంత సేవింగ్స్ చేయాలనుకుంటారు. కాగా, సేవింగ్స్‌లోనూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. డబ్బును పన్ను మినహాయింపు పథకాలలో పెట్టడం వలన ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. కొత్త సంవత్సరంలో ఏయే స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదో తెలుసుకుందాం.
savings plan will give you good returns in the year 2022
మనం తెలుసుకోబోయే ఈ స్కీమ్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్..ఈ ఈక్విటీ ఫండ్‌లో సేవింగ్స్ చేయడం చాలా మంచి ఆప్షన్. ఇందులో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ త్రీ ఇయర్స్ టైం కలిగి ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం కూడా ఉత్తమం. దీని ద్వారా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనీ సేఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత 80 సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఎఫ్ డీలలో ఇన్వెస్ట్ చేసే ముందర వడ్డీ రేట్లు చెక్ చేసుకోవాలి.
సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు స్కీం. కాగా, ఇందులో మ్యగ్జిమమ్ రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీంలో ఏటా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిపై ప్రభుత్వ హామీ ఉంటుంది. సెక్షన్ 80 సి కింద పెట్టుబడిపై ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్.. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. మొత్తం రూ.2 లక్షల వరకు ఈ స్కీమ్ లో మినహాయింపు ఉంటుంది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.