Anchor Suma : దొంగలా మారిపోయింది.. యాంకర్ సుమకు ఎంత కష్టమొచ్చిందో!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 9 October 2021, 7:00 am

Anchor Suma యాంకర్ సుమ  Anchor Suma ఎంతలా బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ఛానెల్ ఈ చానెల్ అనే తేడా లేకుండా.. ఆ షో ఈ షో అనే బేధం లేకుండా అన్నింట్లోనూ సుమ దూసుకుపోతూ ఉంటుంది. యాంకర్ సుమ చేసే హోస్టింగ్, వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. అలాంటి సుమ ఇప్పుడు ఈటీవీ, స్టార్ మా వంటి చానెల్స్‌‌లో పలు ఎంటర్టైన్మెంట్ షోలతో బిజీగా ఉంది. ఇవే కాకుండా ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లతోనూ ఫుల్లుగా సంపాదిస్తోంది.

anchor suma eats and drinks in shooting gap

anchor suma eats and drinks in shooting gap

అయితే క్షణం తీరిక లేకుండా గడిపే సుమ.. ఒక్కోసారి తినడానికి కూడా సమయాన్ని కేటాయించలేకపోతుంది. మామూలుగా అయితే సుమ తన కారులో బ్రేక్ ఫాస్ట్ లాంటిది చేస్తుందట. ఈ మేరకు ఎన్నో వీడియోలను సుమ షేర్ చేసింది. అయితే తాజాగా మరో వీడియోను బయటపెట్టేసింది. స్టార్ మా పరివార్ అవార్డుల వేడుక జరుగుతోంది. అందులో సుమ ఎంతలా కష్టపడుతోందో చూపించేసింది. ఈ మేరకు ఆమె చేసిన రీల్ వీడియో వైరల్ అవుతోంది.

Anchor Suma షూటింగ్ గ్యాప్‌లో సుమ..

suma comments on star maa and bigg boss in cash show

suma comments on star maa and bigg boss in cash show

దొంగచాటులా ఓ డ్రింక్ తాగింది.. తినడానికి కూడా సమయం లేదన్నట్టుగా అందుకే ఇలా ఎవ్వరూ చూడకుండా తాగేయాల్సి వస్తోంది. షూటింగ్ గ్యాప్‌లో ఇలా మ్యానేజ్ చేస్తాను అని సుమ చెప్పేసింది. దాదాపు మూడు నాలుగు గంటలు కంటిన్యూగా పని చేయాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ఇలా చేసేస్తాను అని సుమ చెబుతూ షేర్ చేసిన ఈవీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాలోని పాటకు చేసిన ఈ రీల్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp