Anchor Suma : బుల్లితెరపై తిరుగులేని యాంకర్ సుమ. ఎన్నో షోలతో అలరించిన సుమ చాలా గ్యాప్ తర్వాత జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకులని అలరించింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం ఆకట్టుకుంది. మరోవైపు ఈ షూటింగ్ సందర్భంలో సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చున్న ఆమె కాలు జారి కింద పడ్డారు. రాళ్లు పీచు పట్టి ఉండడంతో కాలు జారి కిందపడింది. తనను తాను కంట్రోల్ చేసుకొని వెంటనే లేచి బయటకు వచ్చేసింది.
అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తాజాగా సుమ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రొడక్షన్స్ టీమ్స్‌కి.. టోటల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఇబ్బంది’. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథగా చిత్రాన్ని తెరకెక్కించారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.
మే 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.సుమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకరింగ్‌పై స్పందించింది. నటిగా రాణిస్తున్న క్రమంలో యాంకరింగ్ మానేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై సుమ కనకాల స్పందించారు. తాను ఇకపై కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పింది. నటన కొనసాగిస్తానని స్పష్టం చేసింది. అయితే యాంకరింగ్ కూడా వదిలే ప్రసక్తి లేదని వెల్లడించింది. ఆ విషయంలో తగ్గేదెలే అంటోంది. టీవీ షోస్‌ని, యాంకరింగ్‌ని వదిలేది లేదని చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని చెప్పింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని తేల్చి చెప్పింది సుమ.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.