Sudigali Sudheer : ఇంటికెళ్లాక ఎయ్ అంటా!.. సుడిగాలి సుధీర్ యాంకర్ సుమకొంటె కామెంట్లు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 1 May 2022, 10:00 pm

Sudigali Sudheer : సుధీర్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో యూట్యూబ్ కామెంట్లు చూస్తే తెలుస్తుంది. పక్క రాష్ట్రాల నుంచి అభిమానులు సుధీర్ మీద ప్రేమకు కురిపిస్తుంటారు. సుధీర్ స్కిట్ల కింద యూట్యూబ్‌లో కామెంట్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటారు. సుధీర్ ఉండే ఏ షోలో అయినా కూడా వాటికి సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ స్కిట్లు వేస్తే యూట్యూబ్‌లో వ్యూస్, కామెంట్లు లెక్కలేనంతగా వస్తుంటాయి.సుధీర్ స్కిట్లలో కూడా ఎయ్ సుధీర్ అన్నా అంటూ ఓ మాదిరి సౌండ్‌లతో రచ్చ చేస్తుంటారు.

అలాంటి సందడే నిన్న సుమ నటించిన జయమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించింది. మే 6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో సుధీర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది. కానీ సుధీర్ అభిమానులు మాత్రం తెగ సందడి చేసేశారు.సుధీర్ స్టేజ్ మీదకు ఎక్కిన తరువాత అభిమానులు ఏ మాత్రం మాట్లాడనివ్వలేదు. అన్నా ఏయ్ అన్నా.. సుధీర్ అన్నా ఎయ్ అన్నా.. అంటూ నానా సందడి చేసేశారు.

Anchor Suma fun with Sudigali Sudheer at Jayamma Panchayathi Pre Release Event

Anchor Suma fun with Sudigali Sudheer at Jayamma Panchayathi Pre Release Event

సుధీర్ తన అభిమానులను ఎంత కామ్ చేయాలని చూసినా కూడా వారు మాత్రం తగ్గలేదు. అన్నా ఎయ్ అన్నా అంటూ అరుస్తూనే వచ్చారు. ఏం ఎయ్యాలి.. ఏం చేయాలి అంటూ సుధీర్ అనేశాడు.ఆ ఇంటికి వెళ్లాక ఏస్తాలే.. అని సుధీర్ అంటాడు. దీంతో సుమ కూడా వెంటనే కౌంటర్ వేస్తుంది. ఇంటికి వెళ్లాక ఎయ్ సుధీర్ అంటూ తెగ నవ్వేసింది. దీంతో సుధీర్ నవ్వుతూ తలదించుకున్నాడు. ఆ తరువాత అందరితో కలిసి స్టేజ్ మీదే సుధీర్ స్టెప్పులు వేశాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp