Tamannah – Mehreen : తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఎఫ్ 3ని గట్టెక్కిస్తాయా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tamannah – Mehreen : తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఎఫ్ 3ని గట్టెక్కిస్తాయా..?

Tamannah – Mehreen : తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఎఫ్ 3ని గట్టెక్కిస్తాయా..? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో చాలా వరకు సీక్వెల్ సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఎఫ్ 3 సినిమా విషయంలో కూడా కొద్దిపాటి సందేహాలు ఉన్నాయంటున్నారు. 2019లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన సినిమా ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సమపాళ్ళలో […]

 Authored By govind | The Telugu News | Updated on :1 May 2022,9:30 pm

Tamannah – Mehreen : తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఎఫ్ 3ని గట్టెక్కిస్తాయా..? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో చాలా వరకు సీక్వెల్ సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఎఫ్ 3 సినిమా విషయంలో కూడా కొద్దిపాటి సందేహాలు ఉన్నాయంటున్నారు. 2019లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన సినిమా ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సమపాళ్ళలో చూపించి దర్శకుడు అనీల్ రావిపూడి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇలాంటి కథ, కథనాలు బాలీవుడ్‌లో వస్తుంటాయి..భారీ హిట్ సాధిస్తుంటాయి.

మన టాలీవుడ్‌లో కూడా గతంలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, సందడే సందడి లాంటి సినిమాలు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని కమర్షియల్‌గా సక్సెస్ సాధించాయి. మళ్ళీ ఇప్పుడు ఈ తరహా పూర్తి కుటుంబ స్థాయి కథా చిత్రాలు వచ్చి భారీ హిట్ సాధిస్తున్నాయి. ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 చిత్రాన్ని ఇదే తారాగణంతో తెరకెక్కించాడు అనీల్ రావిపూడి. ఇంకా సీక్వెల్ సినిమాలో సోనాల్ చౌహాన్, సునీల్ పాత్రలను యాడ్ చేశారు. ఈ పాత్రల ద్వారా సీక్వెల్ సినిమాలో మరింత ఫన్ అండ్ ఫ్రస్టేషన్ జనరేట్ చేస్తున్నాడట.

will tamannah mehreen glamour gives success to F3

will tamannah-mehreen glamour gives success to F3

Tamannah – Mehreen: ఎఫ్ 3 సినిమాకు తమన్నా, మెహ్రీన్ ఎంత వరకు ప్లస్ అవుతారో.

ఇక ఎఫ్ 2లో హీరోయిన్స్‌గా నటించిన తమన్నా, మెహ్రీన్ ఎంత గ్లామర్‌గా కనిపించారో అందరికీ తెలిసిందే. ఓ సాంగ్‌లో తమన్నా, మెహ్రీన్ అందాలు ఎంతగా ఆరబోసి ఆకట్టుకున్నారో ఎఫ్ 2 చూసిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయిలో తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఉండబోతున్నాయి. వీరు తమ అందాలతో మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్‌తో కూడా చితక్కొడతారట. వెంకీ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ పాత్రలే సినిమాకు హైలెట్ కానున్నాయి. మొత్తంగా ఎఫ్ 2 కంటే నాలుగింతలు ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో ఎఫ్ 3 సినిమాలో ఉంటుందట. ఇక రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ మరో హైలెట్ కాబోతుంది. చూడాలి మరి అన్నిటికంటే ఎఫ్ 3 సినిమాకు తమన్నా, మెహ్రీన్ ఎంత వరకు ప్లస్ అవుతారో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది