
Anchor Suma helps to senior actress
Suma : తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా చక్రం తిప్పుతూ.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ తనకి ఎదురే లేదు అని నిరూపిస్తుంది సుమ. మలయాళీ అయిన కూడా తెలుగులో అద్భుతంగా మాట్లాడుతూ ఔరా అనిపిస్తుంది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో దాదాపు రెండు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ.. దూసుకుపోతూనే ఉంది యాంకర్ సుమ. అద్భుతమైన హోస్టింగ్‌తో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానెళ్లలోనూ వరుసగా షోలు చేస్తోంది. తద్వారా ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంటోంది.
సుమ ప్రస్తుతం హోస్ట్ చేస్తోన్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. జబర్దస్త్, ఎక్స్‌స్ట్రా జబర్దస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి దీనిని సుమ కామెడీ టైమింగే ప్రధాన కారణం. తాజాగా నటి సుభాషిణి క్యాష్ షోలో సందడి చేశారు. సీనియర్ నటులు జెన్నీ, బాలజీ, కృష్ణవేణిలతో కలిసి నవ్వులు పూయించారు. సుమ నీ డ్రెస్ బాగుంది అంటూ ఎంట్రీతోనే పంచ్‌లు స్టార్ట్ చేశారు సుభాషిణి.
Anchor Suma helps to senior actress
జెన్నీకి పెళ్లి కాకముందు ఏదైనా ప్రేమకథ జరిగిందా అని అడగ్గా.. ఆయనకు పెళ్లి కన్నా ముందుకంటే ఇప్పుడు బోలేడు లవ్ స్టోరీలు ఉన్నాయంటూ సుభాషిణి కౌంటర్ ఇచ్చారు. అనంతరం యాంకర్ సుమ తనకు చేస్తున్న సాయం గురించి చెప్పుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నేను ఈ రోజు ఇలా నిలబడ్డానంటే దానికి కారణం సుమనే. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే.. నాకు కడుపున నువ్వు పాపవై పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు..’ అంటూ ఎంతోమంది ముఖాలపై చిరునవ్వులు పంచిన సుభాషిణి కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రస్తుతం ఈ క్యాష్ షో ప్రోమో ట్రెండ్ అవుతోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.