Home » Entertainment » Anchor Suma Makeup Man Funny Video
Entertainment

Anchor Suma : ఒక్క సుమ కోసం ఇంత మంది పని చేస్తారా?.. వీడియో వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 5, 2021, 4:16 pm
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తాను ఒక రోజులో ఎన్ని ప్రోగ్రాం, ఎన్ని షెడ్యూల్స్ చేయాల్సి వస్తుందో ఒక్కోసారి సుమకు కూడా గుర్తుండకుండా పోతుందేమో. ప్రస్తుతం సుమ ఉన్నంత బిజీగా బుల్లితెరపై మరో ఆర్టిస్ట్ ఉండరేమో. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా లీడింగ్ చానెల్స్ అన్నింట్లోనూ సుమ తన దైన శైలిలో దూసుకుపోతూ ఉంటుంది. అన్ని చానెల్స్ సుమ కోసం స్పెషల్ షోలున్నాయి.

Advertisement

Anchor Suma Makeup man funny video

స్టార్ మాలో ఈ మధ్యే స్టార్ట్ మ్యూజిక్ ప్రారంభమైంది. జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే కార్యక్రమం ఉంది. ఇక ఈటీవీలో సుమ ప్రోగ్రాంల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి గాకుండా ప్రతీ వారం ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు ఇలా ఎన్నెన్నో ఉంటాయి. అయితే వీటన్నంటికి రెడీ అవ్వాలంటే సుమ ఒక్కదాని వల్ల కాదు. అందుకే హెయిర్స్, మేకప్, స్టైలీష్ట్ ఇలా ఎంతో మంది సుమ చుట్టూ ఉంటారు.

Advertisement

Anchor Suma : ఒక్క సుమ కోసం ఇంత మంది పని చేస్తారా?..

ఏ ఏ షోకు ఏ ఏ బట్టలు వేసుకోవాలి.. ఎలా రెడీ అవ్వాలి.. అన్నది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. తన మేకప్ టీం గురించి సుమ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. తాజాగా వారి గురించి చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. ఇందులో రమేష్ అనే వ్యక్తి మాత్రం కెమెరా కనిపిస్తే చాలు పని లేకపోయినా వచ్చి ఏదో ఒకటి చేస్తాడంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి తన టీం లేకపోతే తాను లేనని చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి