Anchor Suma : అక్కా నీకు దండం పెడతా నా పరువు తీయకు.. సుమ దెబ్బకు తల బాదుకున్న వరుణ్ తేజ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anchor Suma : అక్కా నీకు దండం పెడతా నా పరువు తీయకు.. సుమ దెబ్బకు తల బాదుకున్న వరుణ్ తేజ్

Anchor Suma : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె చాలా ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రవీణ్ సత్తారు ఆ సినిమాకు డైరెక్టర్. మిక్కీ జే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 August 2023,4:00 pm

Anchor Suma : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె చాలా ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రవీణ్ సత్తారు ఆ సినిమాకు డైరెక్టర్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో యాంకర్ సుమ తెగ హడావుడి చేసింది. హీరో వరుణ్ తేజ్ ను ఓ ఆట ఆడుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నన్ను వదిలేయి అక్క నీకు దండం పెడతా అనే రేంజ్ లో సుమ.. వరుణ్ తో ఆటాడేసుకుంది. ఈ సినిమా గన్ నేపథ్యంలో సాగుతుండటంతో గన్ పట్టుకొచ్చి బుల్లెట్ రౌండ్ అంటూ వరుణ్ తేజ్ ను సుమ చెడుగుడు ఆడేసుకుంది.

Anchor Suma making hilarious fun with varun tej

Anchor Suma making hilarious fun with varun tej

Anchor Suma : సుమ దెబ్బకి వరుణ్ తేజ్ నవ్వలేక చచ్చిపోయాడు

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరిలో ఏ హీరో మ్యానరిజం చేయడం మీకు ఇష్టం అని సుమ అడగగా.. ఆ రెండు చూడటం ఇష్టం చేయడం కన్నా అని వరుణ్ తేజ్ తప్పించుకుంటాడు. ఇక రెండో ప్రశ్నగా ఈ ఇద్దరిలో సాక్షి లేక ప్రవీణ్ సత్తారు ఈ ఇద్దరిలో ఎవరితో వర్క్ చేయడం కంఫర్ట్ గా ఉంది అంటే.. సాక్షి వైద్యతోనే కంఫర్ట్ అని చెబుతాడు. ఇక ఆ తర్వాత పెళ్లయిన తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ఇద్దరిలో ఎవరు మారిపోయారు అని సుమ అడగగా.. పెళ్లయిన తర్వాత ఎవరైనా మారాలి అని చెప్పి తప్పించుకుంటాడు. ఇక చివరి ప్రశ్నగా ఈ ఇద్దరిలో కాల్ మీ అర్జెంట్ అని నిహారిక, లావణ్య నుంచి మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తారు అని ప్రశ్నిస్తుంది సుమ. దీంతో తను చిన్న పిల్ల కాబట్టి నిహారికకు ముందు కాల్ చేస్తా అని చెప్పి ఎలాగోలా తప్పించుకుంటాడు వరుణ్ తేజ్.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది