Korean Kanakaraju Movie First Review : వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ – Live Updates ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 6 August 2026, 9:37 pm
  •  Korean Kanakaraju Movie First Review , వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్ షో తర్వాత సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్, సత్య కామెడీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ బ్యాంగ్‌పై ప్రేక్షకులు, నెటిజన్లు చేసిన ట్విట్టర్ రివ్యూలు..

Korean Kanakaraju Movie First Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొణిదెల హీరోగా, యువ నటి రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందే మంచి ఆసక్తిని రేకెత్తించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దక్షా నగార్కర్, కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్, కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను సత్య జీ చేపట్టగా, ఏ. పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్యామ్ కాసర్ల పాటలకు సాహిత్యం అందించగా, యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ముందే పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌లను వీక్షించిన నెటిజన్లు, సినీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో వస్తున్న తొలి స్పందనలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి…

Korean Kanakaraju Movie First Review : వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ - Live Updates ..!

Korean Kanakaraju Movie First Review : వరుణ్ తేజ్.. కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ – Live Updates ..!

Korean Kanakaraju Movie First Review ఫస్ట్ హాఫ్‌పై ప్రేక్షకుల తొలి స్పందనలు ఎలా ఉన్నాయి?

ఒక నెటిజన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఫస్ట్ హాఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలం. వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. వరుణ్ తేజ్ కట్‌అవుట్‌కు తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి” అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మరో ప్రేక్షకుడు స్పందిస్తూ, “ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టలేదు. కథ సాధారణంగానే ఉన్నా దర్శకుడు మేర్లపాక గాంధీ దాన్ని చాలా ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది. అతను వన్ మ్యాన్ షోలా నవ్వులు పంచాడు” అంటూ ట్వీట్ చేశాడు.ఇంకో సినీ అభిమాని తన స్పందనలో, “ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టినట్లు అనిపించదు. కథ సహజంగా ముందుకు సాగుతుండగానే కామెడీ పుడుతోంది. ముఖ్యంగా కనకరాజు-కిష్టప్ప స్నేహం చుట్టూ వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తున్నాయి. వరుణ్ తేజ్, సత్య మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా కనిపించింది. ఇద్దరి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది” అని పేర్కొన్నాడు.

Korean Kanakaraju Movie First Review ఇంటర్వెల్ బ్యాంగ్, థమన్ BGM, వరుణ్ తేజ్ కంబ్యాక్‌పై ఏమంటున్నారు?

మరో సినీ అభిమాని ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అరుదైన చిత్రాల్లో ఇది ఒకటిగా అనిపిస్తోంది. విజువల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ బ్లాక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కడా డల్ కాకుండా మంచి ఎనర్జీతో సాగింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని రాసుకొచ్చాడు.

మరో ప్రేక్షకుడు తన ట్వీట్‌లో, “ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్‌గా సాగింది. వరుణ్ తేజ్‌కు ఇది బలమైన కంబ్యాక్ మూవీ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. సత్య తన కామెడీతో మరోసారి ఆకట్టుకున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ రైటింగ్ బాగా వర్కౌట్ అయింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హై ఇచ్చింది” అని పేర్కొన్నాడు.ఇప్పటివరకు సోషల్ మీడియాలో కనిపిస్తున్న తొలి స్పందనలను పరిశీలిస్తే, ఫస్ట్ హాఫ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్-సత్య కామెడీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ఎపిసోడ్, యాక్షన్ సన్నివేశాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇవి ప్రీమియర్ షో చూసిన కొందరు ప్రేక్షకులు, నెటిజన్ల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. సినిమా విడుదల అనంతరం పూర్తి స్థాయి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. కొరియన్ కనకరాజు , కొరియన్ కనకరాజు రివ్యూ, వరుణ్ తేజ్ ,కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ ,తెలుగు సినిమా రివ్యూ , కొరియన్ కనకరాజు సినిమా స‌మీక్ష‌

Korean Kanakaraju Movie First Review Live Updates

తమ సమస్యకు సంబంధించి లీడ్ పెయిర్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత దాని నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్, అతని గ్యాంగ్ ఓ సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్య నుంచి బయట పడేందుకు వారు ప్రయత్నిస్తుంటారు.

కొరియన్ ఆత్మకు సంబంధించిన నేపథ్యం రివీల్ అవుతుంది. ఇప్పుడు కథలోకి బుల్లిరాజు ఎంట్రీ ఇస్తాడు.

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. వరుణ్ తేజ్, సత్య కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

ఒక ఇంటెన్స్ ఫైట్ మరియు ఒక కీలక ట్విస్ట్‌తో సినిమా సగానికి చేరుకుంది.

హీరోను ఆత్మ ఆవహించిందనే విషయం సత్య తెలుసుకుంటాడు. దీనికి పరిష్కారం కోసం ఆయన ప్రయత్నిస్తుంటాడు

కథలో కీలకమైన సన్నివేశం వస్తుంది. వరుణ్ తేజ్‌ను ఓ కొరియన్ ఆత్మ ఆవహిస్తుంది. ఈ ఎపిసోడ్ చాలా చక్కగా ప్రెజంట్ చేశారు.

వరుణ్ తేజ్, సత్య, ఒక కొరియన్ నటుడిపై కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.

హీరోయిన్ రితిక నాయక్ పరిచయం అవుతుంది. కియా ప్లాంట్‌లో ఆమె ఉద్యోగం చేస్తుంటుంది.

కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దక్ష నాగర్కర్‌తో ‘రాస గుమ్మడి’ సాంగ్ వస్తుంది.

కథ కొరియాలో ప్రారంభమై వెంటనే అనంతపూర్‌లోని కియా ప్లాంట్‌కు షిఫ్ట్ అవుతుంది.

హాయ్.. 2 గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

 

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp