Home » Entertainment » Anchor Suma Marriage Saree Rate Goes Viral
Entertainment

Anchor Suma : సుమ పెళ్లి చీర ఖరీదు ఎంతో తెలుసా?.. వామ్మో యాంకర్ రేంజ్ ఇదేనా?

Authored By
aruna
The Telugu News | Published on: August 8, 2022, 1:20 pm
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ ఒకప్పుడు ఇంత ఫేమస్ కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఒకప్పుడు సీరియల్స్, ప్రోగ్రాంలు, సినిమాలు అంటూ ఏదో అసుమలా నెట్టుకొస్తూ వచ్చింది. ఆ మధ్య దూరదర్శన్ ప్రోగ్రాంలకు కూడా సుమ పని చేస్తూ ఉండేది. అయితే సుమ ఎప్పుడైతే రాజీవ్ కంట్ల పడిందో.. ఈ ఇద్దరి ప్రేమ, పెళ్లి అలా జరిగిందో సుమ జీవితం మారిపోయింది. గత రెండు దశాబ్దాలుగా సుమ తెలుగు వారిని ఎంటర్టైన్ చేస్తూనే వస్తోంది.

Advertisement

కనకాల కుటుంబంలోకి సుమ వచ్చాకా..మొత్తానికి మారిపోయింది. బుల్లితెరపైనే ఫోకస్ పెట్టేసింది. సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉండిపోయింది. అయితే సుమ పెళ్లి 1999లో జరిగిందన్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చాయి. అలా బయటకు రావడానికి కూడా కారణాలున్నాయి. తాజాగా సుమ తన యూట్యూబ్ చానెల్లో ఓ కొత్త వీడియోను వదిలింది. అందులో తన వరలక్ష్మీ వ్రతం చీర, తన తల్లి 80వ బర్త్ డేకు సంబంధించిన చీర షాపింగ్ వీడియోను వదిలింది.

Anchor Suma : షాపింగ్ మాల్‌లో సందడి..

ఇక ఇందులో సుమ షింఘానియా అనే షాపింగ్ మాల్ ప్రాముఖ్యత, విశిష్టతను చెప్పుకొచ్చింది. అందులో ఎన్ని లక్షల రేటున్న చీరలున్నాయో వివరించింది. పది వేల నుంచి పది లక్షల ఖరీదైన చీర కూడా ఉందని చెప్పింది. పదిహేను వేల రేంజులో చూపించు అని సరదాగా అంటే.. మీ రేంజ్ ఇది కాదు మేడం.. అంతా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయని సేల్స్ మేనేజర్ అంటాడు. నాది ఇదే రేంజ్ అండి.. అని సుమ కౌంటర్లు వేస్తుంది.

Advertisement

Anchor Suma Marriage Saree Rate Goes Viral

Anchor Suma : పెళ్లి చీర రేటు..

ఇక ఓ పెళ్లీ చీరను చూపించి.. దీని రేటు రెండు లక్షలు అని చెబుతాడు. వామ్మోఅనుకుంటూ… రాజా మనం మళ్లీ పెళ్లి చేసుకుందామా? రెండు లక్షలా?.. మా పెళ్లి చీర రూ. 11 వేలే.. అంతే పెట్టాం.. అలా అని మేం ఎప్పుడో పెళ్లి చేసుకోలేదండి.. ఈ మధ్యే చేసుకున్నామని కౌంటర్లు వేస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి