Anchor Suma : పుష్ప ప్రీ రిలీజ్.. నీ అవ్వ త‌గ్గేదేలే.. సుమ మాట‌ల తూటాలు…!

Authored By mallesh | The Telugu News | Published on: December 12, 2021, 9:40 pm

Anchor Suma , Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ పార్ట్ వన్ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేసింది మూవీ యూనిట్. ఆదివారం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొంనేందుకు అభిమానులు సంద్రంలా తరలివచ్చారు. గ్రౌండ్స్‌లోకి వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, రేకులను తన్నుకుని మరీ దూసుకొచ్చారు.

Anchor Suma , Pushpa Movie : వేదికపై యాంకర్ సుమ మాటల తూటాలు..

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యాంకర్ సుమ కాగా, ఆమె యాజ్ యూజ్యువల్‌గా మాటలు తూటాలు పేల్చేసింది. ఈ ఈవెంట్‌లో బన్నీ మాటలు వినేందుకుగాను మెగా అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తగ్గేదేలే అనే నినాదాలు చేస్తూ అరుస్తూ ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ వేడుకలాగా చేసేందుకుగాను ప్రొడ్యూసర్స్ పోలీస్ గ్రౌండ్స్‌ను వేదికగా సెలక్ట్ చేశారు. మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు శివ వేదికపై అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు.

anchor suma pushpa movie mega fans shouting at pre release event

anchor suma pushpa movie mega fans shouting at pre release event

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో భారీ తారగణమే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటించింది. అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించగా, విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు. థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోతారని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp