Anchor Suma : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌ను అవమానించిన యాంకర్ సుమ.. ఒక్కసారిగా అలా అనేసిందేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌ను అవమానించిన యాంకర్ సుమ.. ఒక్కసారిగా అలా అనేసిందేంటి?

 Authored By prabhas | The Telugu News | Updated on :11 April 2022,5:00 pm

Anchor Suma : సుధీర్ ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ సందడే కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్ కామెంట్లలో మాత్రం సుధీర్ అభిమానుల ఆదిపత్యమే ఉంటుంది. ఏ షో అయినా, ఏ ఈవెంట్ అయినా కూడా సుధీర్ ఫ్యాన్స్ వచ్చేస్తుంటారు. జై సుధీర్ అన్నా అంటూ కామెంట్లు పెడుతుంటారు. ఆ దెబ్బకు అందరూ ఆశ్చర్యపోయేవారు.సుధీర్ ఫ్యాన్స్ చేసే రచ్చకు సుమ సైతం కొన్ని సార్లు ఇబ్బంది పడింది. సుమ షోలు, ఈవెంట్లలో సుధీర్ ఫ్యాన్స్ హంగామా చేసేవారు.

సుమ హోస్ట్‌గా వచ్చే షోల కింద కూడా సుధీర్ కామెంట్లే కనిపించేవి. సుమ చూసే యూట్యూబ్ వీడియోల కింద కూడా జై సుధీర్ అన్న అంటూ కామెంట్లు కనిపించేవి. అంతే కాకుండా అందులో కొన్ని కన్నడలో కూడా రాసి ఉంటాయి. ఇలా సుధీర్ ఫ్యాన్స్ చేసే హంగామా మీద ఎన్నో సెటైర్లు కూడా పడ్డాయి.ఆ కామెంట్లు పెట్టేది ఎవరు? పెట్టించేది ఎవరు అంటూ సుమ సైతం ఇది వరకు కౌంటర్లు వేసింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోనూ ఈ టాపిక్ మీద ఎన్నో పంచ్‌లు వేశారు. ఆ మధ్య పంచ్ ప్రసాద్ అయితే తెగ రెచ్చిపోయాడు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా స్కిట్లో రెచ్చిపోయాడు.

Anchor Suma Satires on Sudigali Sudheer Fans In Jayamma Panchayathi Promotions

Anchor Suma Satires on Sudigali Sudheer Fans In Jayamma Panchayathi Promotions

తాజాగా ఈ కామెంట్ల విషయాన్ని సుమ కూడా ప్రస్థావించింది. సుమ తాజాగా తన సినిమా జయమ్మ పంచాయితీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ వీడియో చేసింది.సినిమా ప్రమోషన్లలో ఓ ఐడియా ఇవ్వమని గెటప్ శ్రీనుని సుమ అడుగుతుంది. కేజీయఫ్ చాప్టర్ 2 ఇలా పెద్ద పెద్ద సినిమా టీజర్లు, ట్రైలర్ల కింద మన జై జయమ్మ అని కామెంట్లు పెట్టేద్దామని చెబుతాడు. అంటే సుధీర్ ఫ్యాన్స్ జై సుధీర్ అని పెడతారు కదా? అలానా? అవి పెట్టించేది నువ్వేనా? అని సుమ అడిగేస్తుంది. మొత్తానికి సుధీర్ ఫ్యాన్స్‌ను మాత్రం సుమ అలా అవమానించేసింది. వారు అభిమానంతో కామెంట్లు పెడితే.. అవేవో డబ్బులిచ్చి పెట్టించినట్టుగా సుమ చెప్పేసింది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది