Sudigali Sudheer : సుధీర్‌ని ఎదగనీయకుండా చేస్తున్న సీనియర్ హీరో.. ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
ప్రధానాంశాలు:
Sudigali Sudheer : సుధీర్‌ని ఎదగనీయకుండా చేస్తున్న సీనియర్ హీరో.. ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న షో అంటేనే హిట్ గ్యారంటీ అన్న మాట ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. ‘జబర్ధస్త్’ షో ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సుధీర్, తర్వాత టీం లీడర్‌గా స్థిరపడి, పోవే పోరా, ఢీ వంటి షోల్లో యాంకరింగ్ చేస్తూ పాపులారిటీని పెంచుకున్నాడు.

Sudigali Sudheer : సుధీర్‌ని ఎదగనీయకుండా చేస్తున్న సీనియర్ హీరో.. ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
Sudigali Sudheer : ఎవరు అతను ?
సుధీర్ హీరోగా మారిన తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. ‘గాలోడు’ వంటి సినిమాతో హిట్ కొట్టినా, తర్వాత ‘గోట్’ అనే సినిమా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సుధీర్ మళ్లీ టీవీకి మళ్లడంతో “ఏం జరిగింది?” అనే ప్రశ్నకి సమాధానం కోసం ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఒక ప్రముఖ సీనియర్ హీరో, సుధీర్ ఎదుగుదలపై అసహనం కలిగించి, సినీ అవకాశాలను అడ్డుకుంటున్నాడని టాక్ నడుస్తోంది.
అంత టాలెంట్ ఉన్న సుధీర్‌కు అవకాశాలు తక్కువగా రావడం వెనుక ఇదే కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కామెడీ, డ్యాన్స్, ఎమోషన్… ఇలా అన్నిభాగాల్లో సుధీర్ మంచి పర్ఫార్మర్. కొంత మంది యువ హీరోలు డ్యాన్స్ చేయలేని స్టెప్పులు సుధీర్ సునాయాసంగా వేస్తాడు. ‘శివకార్తికేయన్’ లాగా ఎదుగుతాడని భావించిన అభిమానులు ఇప్పుడు అతడికి ఎదురవుతున్న అడ్డంకులను చూసి విచారం వ్యక్తం చేస్తున్నారు. “ఈ తరుణంలో యువ నటులను ప్రోత్సహించాలి గానీ, ఎదుగుదలపై బ్రేక్ వేయడమేంటీ?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.