Home » Entertainment » Anchor Vindhya Supports Anchor Ravi In Bigg Boss 5 Telugu
Entertainment

Anchor Ravi : బిగ్ బాస్ ఇంట్లో రవి అలా.. యాంకర్ కోసం వచ్చిన లేడీ యాంకర్!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 7, 2021, 2:52 pm
Advertisement

Anchor Ravi : బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి ఎలా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. యాంకర్ రవి ఎప్పుడూ ఏదో ఒక ప్రపంచంలో ఉంటాడు. ఎవరితోనూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. వారిని తన మాటలతో ప్రభావితం చేస్తూనే ఉంటాడు. ఆటలో ఉన్నా లేకపోయినా, తన టీం అయినా కాకపోయినా అందరినీ తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. యాంకర్ రవి తన కోసం విశ్వ, లోబోలను బాగానే సెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంటుంది.

Advertisement

Anchor Vindhya Supports Anchor Ravi In Bigg Boss 5 Telugu

ఫిజికల్ టాస్కులు వచ్చినప్పుడు సాయంగా ఉంటారని విశ్వ, లోబోలను తన సైన్యంగా మలుచుకున్నట్టు అనిపిస్తుంది. అలా రవి మొత్తంగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అందరినీ చదివేసి.. వీక్నెస్‌ల మీద కొడుతున్నట్టు అనిపిస్తుంది. మాటలు అనేయడం, తరువాత మార్చేడయం, ఒట్లు వేసి కూడా అబద్దాలు చెప్పడం వంటివాటితో రవి ఇమేజ్ పూర్తిగా దెబ్బ కొట్టేసింది. షన్ను అయితే రవిని దూరంగా ఉంచుతాడు. రవి వస్తున్నాడంటే చాలు భయపడుతుంటాడు.

Advertisement

Anchor Ravi : రవికి అండగా యాంకర్ వింధ్య..

Anchor Vindhya Supports Anchor Ravi In Bigg Boss 5 Telugu

అలాంటి రవి కోసం తాజాగా ఓ లేడీ యాంకర్ ముందుకు వచ్చింది. యాంకర్ వింధ్య రవితో కలిసి కొన్ని షోలు చేసింది. ఈటీవీలో స్టార్ మహిళలాంటి ఓ షోను కూడా చేశారు. అది బాగానే సక్సెస్ అయింది కూడా. అయితే తాజాగా వింధ్య తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. ఇందులో భాగంగా యాంకర్ రవి గురించి చెప్పమని ఓ నెటిజన్ అడిగాడు. బిగ్ బాస్ ఇంట్లో బాగా ఆడుతున్నాడు.. దయచేసి రవిని సపోర్ట్ చేయడంటూ తన ఫ్రెండ్‌కు మద్దతుగా నిలిచింది

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి