Vishnu Priya : నగ్నంగా చూడాలనుకుంటారు!.. మగాళ్లపై విష్ణు ప్రియ ఉద్దేశ్యం అదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : నగ్నంగా చూడాలనుకుంటారు!.. మగాళ్లపై విష్ణు ప్రియ ఉద్దేశ్యం అదేనా?

 Authored By prabhas | The Telugu News | Updated on :19 July 2022,3:30 pm

Vishnu Priya  : యాంకర్ విష్ణుప్రియ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. విష్ణుప్రియ షేర్ చేసిన ఫోటోలు, ఫోటో షూట్లు నెట్టింట్లో మంటలు పుటిస్తుంటాయి. ఇక ఆమె ఎక్కువగా సద్గురు కొటేషన్లను షేర్ చేస్తుంటుంది. ఫన్నీ వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇంగ్లీష్ కొటేషన్లను షేర్ చేస్తుంటుంది. అలా ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తూ తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటుంది. అయితే ఈ మధ్య మాత్రం విష్ణుప్రియ హద్దులు దాటేసినట్టు కనిపిస్తోంది. అందాల ఆరబోతలో విష్ణుప్రియ బార్డర్లు క్రాస్ చేసినట్టు అనిపిస్తోంది. ఎద అందాలు, క్లీ వేజ్ షోలతో విష్ణుప్రియ నానా హంగామా చేసింది.

ఆమె చేసిన హాట్ ఫోటో షూట్లకు నెట్టింట్లో అగ్గి పుట్టేసింది. ఇక ఆమె ఇన్ స్టా ఫాలోవర్లు దెబ్బకు పెరిగిపోయారు. అలా వెంటనే మిలియన్ ఫాలోవర్లు వచ్చి పడ్డారు. అదంతా కూడా ఆమె అందాల ఆరబోత మహిమే. అలా విష్ణుప్రియ తన క్రేజ్, ఫాలోవర్లను పెంచేసుకుంది. అయితే విష్ణుప్రియ మాత్రం తన హంగామాను తగ్గించడం లేదు. తాజాగా వర్కవుట్లతో మరోసారి అందరినీ ఫిదా చేసింది. సండే మండే అనే తేడా లేకుండా విష్ణుప్రియ వర్కవుట్లు చేస్తోంది. తన ఫిట్ నెస్‌ను కాపాడుకుంటూ ఉంటుంది. వర్కవుట్లు అంటే మామూలు వర్కవుట్లు కూడా చేయడం లేదు.

anchor Vishnu priya about men behaviour quotes

anchor Vishnu priya about men behaviour quotes

స్టంట్స్ చేస్తోంది. జిమ్నాస్టిక్స్ చేసేస్తోంది. బాక్సింగ్ నేర్చుకుంటోంది. ఇవన్నీ ఎందుకు చేస్తోందో కూడా తెలియడం లేదు. అయితే తాజాగా విష్ణుప్రియ ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. ఎక్కడో వైరల్ అయిన వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. అందులో ఒకతను ఇలా అంటాడు. మగాళ్ల, ఆడాళ్లంతా కూడా ఒకరొకరు అట్రాక్ట్ అవుతుంటారు.అయితే మగాడు మాత్రం ఆడదాన్ని నగ్నంగా చూడాలనుకుంటాడు.. కానీ ఆడవాళ్లు మాత్రం మగాళ్లను సూట్‌లో చూడాలనుకుంటారు.. అదే తేడా అంటూ ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని విష్ణుప్రియ షేర్ చేస్తూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది