Anchor Vishnu Priya : ఆ వీడియో షేర్ చేసి అడ్డంగా బుక్కైంది.. యాంకర్ విష్ణుప్రియపై ట్రోల్స్
Anchor Vishnu Priya : కొన్ని వీడియోలుంటాయి.. వాటిని చూసి నవ్వుకుని వదిలేయాలి. కొన్ని వీడియోలుంటాయి.. నవ్వుకుని.. షేర్ చేసినా నష్టం రాదు. కానీ ఇంకొన్ని వీడియోలుంటాయి.. నవ్వుకుని.. వాటి అర్థాన్ని అర్థం చేసుకుని షేర్ చేయకుండా వదిలేయాలి. అయితే విష్ణుప్రియ మాత్రం అలా చేయలేదు. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒకతను ఫోన్‌లో బిజీగా ఉంటాడు. అతని భార్య వస్తుంది.. జుట్టు సరిచేసుకుంటుంది. మోకాళ్ల మీద కూర్చుంటుంది. ఇక అతను ఏదో ఫీలై రెడీ అవుతుంటాడు. కానీ ఇంతలో పక్కకి జరుగు అన్నట్టుగా తోసేస్తుంది. అతను ఆనుకుని ఉన్న వాషింగ్ మెషీన్‌లోంచి బట్టలు తీసుకుని వెళ్తుంది. దీని భావం ఏంటో వీడియో చూసిన వాళ్లకు అర్థం అవుతుంది.

Anchor Vishnu Priya Gets Trolling For SHaring Video
Anchor Vishnu Priya : అలాంటి దానివే అంటూ ట్రోల్స్..
అయితే ఇలాంటి వీడియోను షేర్ చేసి విష్ణుప్రియ తనకు తానే నెగెటివిటీని కోరి తెచ్చుకుంది. నెటిజన్లు విష్ణుప్రియను దారుణంగా ఏకిపారేస్తున్నారు. నువ్ అలాంటి దానివే.. నీకు అలాంటివి ఈజీగానే అర్థమవుతాయి.. నువ్ అలానే చేస్తుంటావ్ కదా? అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విష్ణుప్రియ పోస్ట్ మాత్రం మంట పెట్టేస్తోంది.