Anchor Vishnu priya : డేట్‌కి వెళ్తే ఏమవుతుంది?.. మథనపడుతున్న యాంకర్ విష్ణుప్రియ.. వీడియో

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 9, 2021, 2:27 pm

Anchor Vishnu priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya  ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ కోసం తెగ శ్రమిస్తోంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఆమె చేతిలో ఓ వెబ్ సిరీస్ పడింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మింలు చేసుకునే విష్ణుప్రియ.. బుల్లితెర, వెండితెరపై రచ్చ చేసింది. అయితే మధ్యలో మాత్రం విష్ణుప్రియ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బుల్లితెరపై షోలు లేక, వెండితెరపై ఆఫర్లు రాక, కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఫిక్స్ అయింది.

Anchor Vishnu priya Promotes The Baker And Beauty

Anchor Vishnu priya Promotes The Baker And Beauty

డేట్‌కి వెళ్తే ఏమవుతుంది?..  విష్ణుప్రియ Anchor Vishnu priya

అలాంటి విష్ణుప్రియ మొత్తానికి ఇప్పుడు ఓ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మించిన ది బేకర్ అండ్ బ్యూటీ వెబ్ సిరీస్‌తో విష్ణుప్రియ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. ఆహాలో వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.

 

Anchor Vishnu priya Promotes The Baker And Beauty

Anchor Vishnu priya Promotes The Baker And Beauty

 

ప్రేమలో ఉన్న మహి.. తాను ప్రేమించే విజ్జు.. తనకు ప్రపోజ్ చేస్తాడా? లేదా? తెగ మథన పడుతుంది. ఈ క్రమంలోనే డేట్ నైట్‌కు వెళ్లేందుకు ఇద్దరూ సిద్దపడతారు. అక్కడ వాడు తనకు ప్రపోజ్ చేస్తాడా? లేదా? చేయకపోతే ఎలా? అంటూ ఆందోళన చెందుతుంది. ఇంతకీ డేట్ నైట్‌లో ఏమవుతుంది అని తన సినిమా గురించి విష్ణుప్రియ తెగ ప్రమోషన్ చేసుకుంటోంది.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp