Home » Entertainment » Anchor Vishnu Priya Traditional Look On Sravana Shukra Vaaram
Entertainment

Vishnu Priya : శ్రావణ శుక్రవారం అంటూ పోస్ట్.. విష్ణుప్రియ ఎంత పద్దతిగా ఉందో

Authored By
aruna
The Telugu News | Published on: July 30, 2022, 3:00 pm
Advertisement

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఒక్కోసారి హద్దులు దాటినట్టు అనిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో దైవ భక్తి, దైవ చింతన ఎక్కువ అనిపిస్తుంది. కాశీ, నాసిక్ వంటి ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. సద్గురు ఈషా ఫౌండేషన్ కార్యక్రమాలకు వెళ్తుంటుంది. మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొంటుంది. ఇంట్లో పూజలు చేస్తుంటుంది. సందర్భం ఉంటే.. ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకుంటుంది. అలా విష్ణుప్రియ కొన్ని సందర్భాల్లో ముచ్చటగొలిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో మితి మీరిన అందాల ప్రదర్శనతో విమర్శల పాలవుతుంటుంది. ఇక ఈషౌ ఫౌండేషన్ మాదిరిగా.. రుద్ర అనే ఫౌండేషన్‌ను విష్ణుప్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని ద్వారా తనకు తోచిన సాయాన్ని విష్ణుప్రియ అందిస్తుంటుంది.

Advertisement

అలా విష్ణుప్రియ చేసే సేవా కార్యక్రమాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే విష్ణుప్రియ ఎక్కువగా ఎక్స్ పోజింగ్ మీద ఆధారపడుతుండటంతో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇదే సమయంలో విష్ణుప్రియ మంచితనం కూడా వెలుగులోకి వస్తుంటుంది. ఇక విష్ణుప్రియ కొన్ని సార్లు తింగరి చేష్టలు చేస్తుంటుంది. మొన్నా మధ్య వరుసగా ఆమె చేసిన ఫోటో షూట్లు నెట్టింట్లో కాకపుట్టించేశాయి. ఎద అందాలు, క్లీ వేజ్ షోలు నెటిజన్లకు మతిపొగొట్టేలా చేశాయి. ఇలాంటి పనులు చేయడంతోనే విష్ణుప్రియకు నెగెటివిటీ ఏర్పడుతుంటుంది. అయితే నెట్టింట్లో మాత్రం ఫుల్ క్రేజ్, ఫాలోయింగ్ పెరుగుతోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఎలా ఉన్నా..

Anchor Vishnu Priya Traditional Look On Sravana Shukra Vaaram

Advertisement

ఎలాంటి దుస్తులు వేసుకుని రచ్చ చేస్తున్నా.. కొన్ని సందర్భాల్లో విష్ణుప్రియ అందరి మనసును దోచేస్తుంటుంది. గో సేవ చేస్తుంది.. గుళ్లకు వెళ్తుంటుంది. తాజాగా శ్రావణ శుక్రవారం అంటూ ఉదయాన్నే లేచి సంప్రదాయబద్దంగా రెడీ అయింది. ఈ చీరకట్టులో విష్ణుప్రియను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ చీరలో విష్ణుప్రియ ఎంతో అందంగా ఉంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంతో రాబోతోంది. ఇందులో సుధీర్, విష్ణుప్రియ, దీపిక పిల్లి, అనసూయ, సునీల్ వంటి వారు నటించారు.

Anchor Vishnu Priya Traditional Look On Sravana Shukra Vaaram

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి