Anil Ravipudi – Koratala Siva : ఒక్క ఫ్లాప్‌తో ఇన్నేళ్ళ క్రెడిట్ కరిగినట్టేనా..?
Anil Ravipudi – Koratala Siva : ఒకే ఒక్క ఫ్లాప్ ప్రతీ డైరెక్టర్‌ను డైలమాలో పడేస్తుంది. వరుసగా సక్సెస్‌లు అందుకున్న దర్శకుడెవరైనా ఫ్లాప్ వస్తుందని కోరుకోడు..ఊహించడు. కానీ, ఆయన చేసే సినిమాల ప్రభావం జనాలపై ఎక్కువగా ఉండి అధికంగా అంచనాలు పెరగడం..కథలో కొత్తదనం లేకపోవడం..కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావడం లాంటి అనేక కారణాల వల్ల ఫ్లాప్ చూడాల్సి వస్తుంది. నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడు కూడా ఒక్క ఫ్లాప్ పడితే కాస్త కంగారు పడిపోతారు. గతంలో సాధించిన సక్సెస్‌లను పక్కన పెట్టి ప్రస్తుతం వచ్చిన ఫ్లాప్‌ను పట్టుకొని కామెంట్స్ చేసేయడం మొదలైపోతుంది.
ఇప్పుడు అలాంటి ఒక్క ఫ్లాప్‌తో డైలమాలో పడ్డారు ఇద్దరు దర్శకులు. వారే కొరటాల శివ – అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడు విషయానికొస్తే..పటాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో కామెడితో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కింది. దాంతో వరుసగా సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. దాంతో టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, మొదటిసారి అనిల్ రావిపూడికి ఎఫ్ 3 రూపంలో ఫ్లాప్ వచ్చిందని అంటున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇది అనిల్ ఫస్ట్ ఫెల్యూర్ అంటున్నారు.
Anil Ravipudi – Koratala Siva : ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’ అనే ట్యాగ్‌ను మిస్ చేసుకున్నారు.
ఇక కొరటాల శివకు ఆచార్య ముందు వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలీదనే చెప్పాలి. మంచి రచయిగా హీరోల వద్ద నిర్మాతల వద్ద పేరు తెచ్చుకున్న కొరటాల శివ పోసాని కృష్ణ మురళి సపోర్ట్‌తో దర్శకుడిగా మారాడు. ప్రభాస్‌తో ఆయన తీసిన మిర్చి భారీ కమర్షియల్ సక్సెస్ సాధించింది. ప్రేమిస్తే పోయిందేముంది డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..అనే మెసేజ్ ఇచ్చి భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చేసి వరుసగా భారీ హిట్స్ అందుకున్నాడు. కానీ, మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇలాంటి ఫ్లాప్ కొరటాల నుంచి వస్తుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఈ రకంగా అటు కొరటాల, ఇటు అనీల్ రావిపూడి కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ చూసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనే ట్యాగ్‌ను మిస్ చేసుకున్నారు.