Anil Ravipudi : మెగాస్టార్ తో అనిల్ నెక్స్ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్.. ఈసారి పక్కా టార్గెట్ తో..!
ప్రధానాంశాలు:
Anil Ravipudi : మెగాస్టార్ తో అనిల్ నెక్స్ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్.. ఈసారి పక్కా టార్గెట్ తో..!
Anil Ravipudi : సంక్రాంతికి తన సినిమా వస్తే సూపర్ హిట్ పక్కా అనిపించేలా చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసిన అనిల్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అనిల్ కెరీర్ లో 8 సినిమాలు చేస్తే ఆ 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే 300 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనిల్ తో సినిమా అంటే హిట్ పక్కా అనిపించేలా చేసుకున్నాడు. ఐతే నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తాడని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చిరంజీవి తో కూడా తన మార్క్ ఎంటర్టైనర్ గా సినిమా చేస్తానని అంటున్నాడు అనిల్ రావిపూడి.
Anil Ravipudi : 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి..
అంతేకాదు ఈ సినిమాను మళ్లీ నెక్స్ట్ సంక్రాంతికి తెచ్చేలా ప్లానింగ్ లో ఉందట. అనిల్ రావిపూడి తో సినిమా అంటే పక్కా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ చిరు సినిమాతో అంతకుమించి అనిపించేలా చూస్తున్నాడు.
అనిల్ రావిపూడి చిరంజీవి ఈ కాంబో కచ్చితంగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని నమ్ముతున్నారు. సో అనిల్ చిరు సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇప్పటికే సీనియర్ హీరోలైన వెంకటేష్, బాలకృష్ణలతో సినిమాలు చేసిన అనిల్ నెక్స్ట్ చిరంజీవితో సినిమాకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా తర్వాత అనిల్ కింగ్ నాగార్జునతో కూడా చేస్తే ఈ తరం దర్శకులలో అందరు సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా అనిల్ రావిపూడి స్పెషల్ రికార్డ్ అందుకుంటాడు. చిరు సినిమా హిట్టైతే నాగ్ తో సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఐతే చిరు తో సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. Anil Ravipudi , Megastar Chiranjeevi , Venkatesh, Sankranthiki Vastunnam