Chiranjeevi : నిర్మాతను పీడిస్తున్న చిరంజీవి?.. ఆస్తులు అమ్ముకుంటోన్న అనిల్ సుంకర

Authored By aruna | The Telugu News | Published on: August 13, 2023, 6:00 pm

Chiranjeevi : స్టార్ హీరోలతో సినిమా అంటేనే కత్తి మీద సాము వంటిది. వారి రెమ్యూనరేషన్లే తడిసి మోపెడు అవుతుంటాయి. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా తట్టాబుట్టా సర్దుకోవడమే. అందుకే స్టార్ హీరోలతో పెద్ద నిర్మాతలే సాహసం చేస్తారు. చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలు కూడా స్టార్ల జోలికి వెళ్లరు. ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో అనిల్ సుంకర మీద పిడుగు పడింది. సామజవరగమన, హిడింబ సినిమాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలోపే భోళా శంకర్ అంటూ మరో పిడుగు పడింది. ఈ సారి ఏకంగా పాతాళంలోకి వెళ్లినట్టు అయింది.

భోళా శంకర్ సినిమా సొంతంగా రిలీజ్ చేసుకున్నాడట అనిల్ సుంకర. బిజినెస్ ఓ మోస్తరుగా జరుగుతుంటే.. చిరంజీవి హర్ట్ అయ్యాడట. నా స్థాయిని తగ్గించి, తక్కువ రేటుకు అమ్ముతున్నావా? అని అనిల్ సుంకర మీద ఫైర్ అయ్యాడట. దీంతో అనిల్ సుంకర సొంతంగా రిలీజ్ చేశాడట. దీంతో అనిల్ సుంకర దాదాపు అరవై కోట్ల వరకు లాస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ ఈవెన్ అవ్వదని ట్రేడ్ లెక్కలు చూస్తే అర్థం అవుతోంది. సినిమా డిజాస్టర్‌గా నిలవనుంది.

Anil Sunkara Sold Properties for Chiranjeevi Remuneration

Anil Sunkara Sold Properties for Chiranjeevi Remuneration

అయితే ఈ టైంలో చిరంజీవి తన రెమ్యూనరేషన్ కోసం పట్టుబట్టాడట. నిర్మాతను పీడిస్తున్నాడట. ఈ మేరకు నెట్టింట్లో రూమర్లు చక్కర్లు కొడుతన్నాయి. ఈ సినిమా 65 కోట్ల రెమ్యూనరేషన్ చిరు తీసుకుంటున్నాడట. అందులో 50 కోట్ల వరకు ఆల్రెడీ అనిల్ సుంకర ఇచ్చేశాడట. కానీ మిగిలిన డబ్బు కోసం ఇప్పుడు చిరు పట్టుబట్టుకుని కూర్చున్నాడట. ఈ మేరకు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. చిరుకి ఇవ్వాల్సిన డబ్బు కోసం అనిల్ సుంకర తన ప్రాపర్టీలను తాకట్టు పెట్టడం, అమ్మడం వంటివి చేస్తున్నాడట. మొత్తానికి చిరుతో పెట్టుకున్న అనిల్ సుంకరకు సున్నం కూడా మిగిలేట్టు లేదని సెటైర్లు పడుతున్నాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp