Home » Entertainment » Animal Movie Public Talk
Entertainment

Animal Movie Public Talk : యానిమల్ మూవీ ప‌బ్లిక్ టాక్‌.. రన్ బీర్ – రష్మికతో ఆ సిమా తీశావా ఏంటి సందీప్ అంటున్న ఫ్యాన్స్‌..!

Authored By
Anusha V
The Telugu News | Published on: December 1, 2023, 6:00 pm
Advertisement

Animal Movie Public Talk : ‘ అర్జున్ రెడ్డి ‘ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నారు. బాలీవుడ్లో అర్జున్ రెడ్డికి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమా చేసి బాలీవుడ్ లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా ‘ యానిమల్ ‘ సినిమాను తెరకెక్కించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 1నవిడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. పార్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాపై కామెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియాకి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ నాతో పాటు ఇప్పుడు రణబీర్ కపూర్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి రన్ బీర్ కపూర్ నటన అద్భుతంగా ఉందని, ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుందని మృగమే మనిషి అయితే ఎలా ఉంటుందని కాన్సెప్ట్ ని బాగా చూపించారని, రష్మిక స్క్రీన్ ప్లే చాలా బాగుందని, ప్రేయసిగా, ఇద్దరు పిల్లల తల్లిగా అందంగా కనిపిస్తూనే, నటనకి ప్రాధాన్యం ఉన్న సన్నివేశాలతో కట్టిపడేసింది అని పబ్లిక్ చెబుతున్నారు. అలాగే రణబీర్ కపూర్ – అనిల్ కపూర్, రణ్ బీర్ కపూర్ – రష్మిక మందన మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి అని పబ్లిక్ టాక్.

అయితే ముందు నుంచి సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారు. కానీ యానిమల్ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు అంతగా లేవని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలతోనే కథకు ముగింపు నివ్వడం గొప్ప విషయమని. మిషన్ గన్ తో యాక్షన్ సీన్ లు చాలా బాగున్నాయని, సందీప్ రెడ్డి వంగ సినిమాను బాగా తీశారని, రొమాన్స్ సన్నివేశాలు కూడా లేవు చాలా మంచి కంటెంట్ ఉందని, కొన్ని డైలాగ్స్ మాత్రం వల్గర్ గా ఉన్నాయని, ఈ సినిమాని ఎవరైనా చూడవచ్చని, తెలిసిన కథనే నేటితరం ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టుగా తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు మొత్తానికి యానిమల్ సినిమా అన్ని విధాలుగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని మొదటి రోజు బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి