Anitha Chowdhary : నాకు అవకాశాలు ఇవ్వండి ప్లీజ్.. మేకర్స్ ను బతిమిలాడుకున్న అనితా చౌదరి.. వీడియో వైరల్
Anitha Chowdhary : మీకు ఛత్రపతి సినిమా గుర్తుందా? ఆ సినిమాలో సూరీడు అనే ఓ చిన్నపిల్లాడి పాత్రకు కళ్లు లేని తల్లిగా అనితా చౌదరి నటించింది. తను ఆ ఒక్క సినిమానే కాదు.. దాదాపు 50 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే.. పలు సీరియళ్లలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది అనిత. నిజానికి తను సీరియల్ ఆర్టిస్టుగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తనకు సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. టీవీ యాంకర్ గానూ తను ఫేమస్ అయింది.
అయితే.. ఇంత గుర్తింపు సాధించినా చివరకు తనకు అవకాశాలే కరువయ్యాయి.ప్రస్తుతం తను ఏ సినిమాలో కనిపించడం లేదు. చాలా సంవత్సరాల నుంచి తను ఏ సినిమాలో కనిపించకపోవడంతో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు అవకాశాలు ఇవ్వాలంటూ మేకర్స్ ను వేడుకుంది అనితా చౌదరి. నిజానికి తన కెరీర్ ప్రారంభంలో తనకు హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయట. కానీ.. తను హీరోయిన్ అవడం ఇష్టం లేక ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిందట.
Anitha Chowdhary : అనితా చౌదరి వీడియోను చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
అనితా చౌదరి మరీ ఇంతలా అవకాశాలు కావాలంటూ మేకర్స్ ను బతిమిలాడే వీడియోను చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇంత ఫేమ్ సంపాదించిన తర్వాత కూడా అవకాశాలు రావడం లేదు అంటే ఏం అనాలి. అక్కినేని ఫ్యామిలీతో అంత అనుబంధం ఉన్నప్పటికీ తనకు ఎందుకు ఒక్కసారిగా అవకాశాలు రావడం ఆగిపోయాయి. తను చివరకు నాకు అవకాశాలు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేసుకునే స్థాయికి ఎందుకు వచ్చింది అంటూ తమకు నచ్చిన కామెంట్లు చేస్తున్నారు.