Samantha : డైరెక్టర్ భార్య మరో ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఇది కూడా సమంత పైనేనా..?
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత – బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో కలిసి పని చేసిన తర్వాత వారిద్దరి మధ్య సన్నిహితత పెరిగిందని, అప్పటి నుంచి వారి మధ్య ప్రత్యేక బంధం కొనసాగుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంత నటించిన ‘సిటాడెల్’ సిరీస్‌కి కూడా రాజు నిడుమోరే దర్శకత్వం వహించడం, ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో కూడా ఆయన కో-ప్రొడ్యూసర్‌గా ఉండటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
Samantha : డైరెక్టర్ భార్య మరో ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఇది కూడా సమంత పైనేనా..?
ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో రాజు నిడుమోరు భుజంపై వాలిన ఫొటోను పోస్ట్ చేయడం, తిరుపతిలో ఆమెను ఆయన కలిసి వెళ్లడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ కొనసాగుతోందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇదే సమయంలో రాజు నిడుమోరు భార్య శ్యామల మాత్రం గతకొంతకాలంగా తన భర్త గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయకపోవడం గమనార్హం. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన శ్యామల, ఇప్పుడు పూర్తిగా మౌనంగా ఉండటం, విడాకుల దిశగా రాజు నిడుమోరు పయనిస్తున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
తాజాగా శ్యామల చేసిన పోస్ట్‌లు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. “నమ్మకం అన్నది కోల్పోతే తిరిగి పొందలేరు” అంటూ ఓ సందేశాన్ని షేర్ చేయడం, అంతకు ముందు “మంచి కర్మ సృష్టించండి” అంటూ పెట్టిన పోస్టులు ఆమె భావోద్వేగ పరిస్థితిని బాగా ప్రతిబింబిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. వీటిని ఆమె భర్తపై ఉద్దేశించిందనే అర్థం నెటిజన్లు వేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజు నిడుమోరు – సమంత మధ్య ఉన్న సంబంధం నిజమా? అనే దానిపై స్పష్టత లేదు కానీ, ఈ వ్యవహారం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.