RC 15 Movie : రామ్ చ‌ర‌ణ్ సినిమాకి లీకుల బెడ‌ద‌.. తాజాగా మ‌రో లీక్‌

Authored By Sam C | The Telugu News | Published on: May 11, 2022, 5:30 pm

RC 15 Movie : ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఏదో ఒక జ‌ లీక్ బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. ఇప్ప‌టికే సినిమా నుండి ప‌లు లీక్స్ బ‌య‌ట‌కు రాగా, తాజాగా మ‌రో లీక్ జరిగింది. దీంతో చిత్ర బృందం చాలా ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ మరియు డైరెక్టర్ ఎస్.జె.సూర్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.లీకుల ప‌ర్వం..ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో ఆర్కే బీచ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మూవీ యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. దానికి కారణం రామ్ చరణ్ ఫోటోలు లీక్ కావడం. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా, చెర్రీ పంచెకట్టు లుక్ లీకైంది. అమృత్ సర్‌లో కాలేజ్ సీన్లు కూడా లీక్ అవ్వడంతో చిత్ర బృందం షాక్ అయింది. రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. రామ్ చరణ్ నడి రోడ్డు మీద డాన్స్ వేస్తోన్న వీడియో కూడా వైరల్ అవుతోంది.

another leak from rc 15 Movie

another leak from rc 15 Movie

చూస్తుంటే అది సాంగ్ షూటింగ్‌లా అనిపిస్తోంది.ట్రాఫిక్ పోలీస్ తో గొడవ పడి, బోర్డును కూడా పీకి డాన్స్ వేశాడు చెర్రీ. ఈ వీడియోను షేర్ చేస్తూ అభిమానులు ఖుషీ సినిమాలోని “యే మే రా జహా” అనే పాటతో సింక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర టాకీపార్ట్, సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకుంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp