Prabhas : ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్..

Prabhas : బాహుబలి.. ఈ మూవీ చెబితే బాక్సాఫిస్ వద్ద బద్దలైన రికార్డులే గుర్తుకువస్తాయి. ఈ మూవీతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ను దాటి పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు డార్లింగ్.. ఈ మూవీ తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యా్ప్తంగా మంచి హిట్ సొంతం చేసుకుంది. తెలుగు మూవీ సత్తాను విశ్వానికి చాటి చెప్పింది. తెలుగు మూవీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీ ఈ రేంజ్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :3 March 2022,8:02 pm

Prabhas : బాహుబలి.. ఈ మూవీ చెబితే బాక్సాఫిస్ వద్ద బద్దలైన రికార్డులే గుర్తుకువస్తాయి. ఈ మూవీతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ను దాటి పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు డార్లింగ్.. ఈ మూవీ తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యా్ప్తంగా మంచి హిట్ సొంతం చేసుకుంది. తెలుగు మూవీ సత్తాను విశ్వానికి చాటి చెప్పింది. తెలుగు మూవీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందని డైరెక్టర్ రాజమౌళి సైతం ఊహించి ఉండరు. వార్ మూవీస్ ప్రపంచానికి కొత్తేం కాదు.

కానీ ఇలాంటివి చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ సైతం ధైర్యం చేయలేదు. కానీ రాజమౌళి చాలా రిస్క్ చేసి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. వీరిద్దరూ కలిసి మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీపై ఇటీవల ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ముంబైలో మీడియాతో మాట్లాడారు యంగ్ రెబల్ స్టార్.. రాజమౌళితో కచ్చితంగా సినిమా చేస్తా. ఓ చిన్న స్టోరీ ఐడియాపై ఇద్దరం డిస్కస్ చేసాం.

another movie in rajamouli prabhas combination

another movie in rajamouli prabhas combination

Prabhas : ఎన్ని సంవత్సరాలకో..

ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ.. చేయడం మాత్రం పక్కా అంటూ చెప్పొకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ మూవీ ఈ నెలలో రిలీజ్ కానుంది. ఈ మూవీతో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ ను పాన్ ఇండియా స్టార్స్ గా పనిచేయ చేయబోతున్నాడు. అనంతరం ప్రిన్స్ మహేశ్ తోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీస్ పూర్తయిన తర్వాతే ప్రభాస్ తో కలిసి రాజమౌళి మూవీ చేయనున్నారని టాక్. మరి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది