Chiranjeevi : సోషల్ మీడియాలో యాంటీ మెగా ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా గాడ్ ఫాదర్ పై విమర్శలు చేస్తున్నారు. వాటిని మెగా ఫాన్స్ బలంగా తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా గురించి చర్చ తార స్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలోని పలు సన్నివేశాలను సేమ్ టు సేమ్ అన్నట్లుగా లూసిఫర్ నుంచి సిగ్గు లేకుండా సన్నావేశాలు దించేశారు అంటూ యాంటీ ఫ్యాన్స్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా వాళ్లు షేర్ చేస్తున్నారు. ఇక మెగా ఫాన్స్ వాళ్లకు కౌంటర్ అన్నట్లుగా సినిమా మలయాళం హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ అంటూ అధికారికంగా ప్రకటించారు. సినిమా రీమేక్ అన్నప్పుడు సన్నివేశాలు మ్యాచ్ కాకుండా ఎలా ఉంటాయి అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఏ హీరో రీమేక్ చేసినా ఎంత పెద్ద దర్శకుడు రీమేక్ చేసినా ఎక్కువ శాతం సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగానే తీయాల్సి ఉంటుంది. ఏదైనా మార్చిన కూడా దాని ప్రభావం సినిమా ఫలితం పై మరియు కథ యొక్క సోల్ పై పడుతుంది. అందుకే ఎక్కువ శాతం దర్శకులు రీమేక్ చేసేటప్పుడు ఏమాత్రం మార్పు చేయకుండా ముందుకు తీసుకు వెళ్తారు. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో కూడా మోహన్ రాజా అదే చేశాడు, మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మాదిరిగానే నటించారు. అందులో మొహమాటం ఏమీ లేదు, రహస్యం అంతకన్నా లేదు. కొందరు కావాలని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీమేక్ అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా దించుతారు దానికి సిగ్గు లేకుండా కాపీ చేశారంటూ విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అంటూ మెగా ఫాన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో కూడా గాడ్ ఫాదర్ సినిమా భారీగా విడుదల అవ్వనుంది. సినిమాకు ఉన్న అంచనాల నేపథ్యంలో మొదటి రోజు 20 నుండి 25 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్ముతున్నారు. మరి గాడ్ ఫాదర్ కి ఆ స్థాయిలో వసూళ్లు వస్తాయా అనేది చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.