Anupama Parameswaran : మందులో మునిగి తేలుతున్న అనుపమ.. రాత్రి అయితే వైన్ ఉండాల్సిందేనట..!
Anupama Parameswaran : మలయాళీ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ని ఏలుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ చాలా మంది మలయాళీ హీరోయిన్స్ టాప్ హీరోయిన్‌గా ఎదిగి రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. 2015లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్‌తో వెండి తెరకు పరిచయమైంది. ఈ కర్లీ హెయిర్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తుంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోఈ ముద్దుగుమ్మ షేర్ చేసే క్యూట్ పిక్స్ అందరి మతులు పోగొడుతుంటాయి. అంతే కాక ఆ పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాయి.నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనుపమ.
ఇందులో ఆమె నటనకు జీ సినిమా తెలుగు అవార్డు లభించింది. కెరీర్‌లో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.వీకెండ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన పిక్స్ షేర్ చేస్తూ.. వైన్ కోసమే ఇలా రాత్రి వస్తుంది.. పక్కకి జరపకండి.. నా ఫోటోలను చూపించాలని అనుకోవడం లేదు అంటూ తాగినట్టుగా ఉన్న పోజులు పెట్టేసింది అనుపమ. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.క్యూట్ లుక్స్‌తో కుర్రకారును పడగొట్టే అనుపమ పరమేశ్వరన్ రీసెంట్‌గా నటించిన చిత్రం రౌడీ బాయ్స్. ఈ మూవీలో కొత్త హీరోతో లిప్‌లాక్ సీన్లలో నటించి రెచ్చిపోయిందీ మల్లూ బ్యూటీ.

anupama parameswaran chil with week end special wine
ఇప్పటివరకు డీసెంట్‌గా కనిపించిన అనుపమ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీస్తూ రొమాన్స్‌లతో చెలరేగిపోయింది. ఇది చూసి అభిమానులు సైతం షాక్ అయ్యారు! అనుపమ ఈ రేంజ్‌లో హద్దులు దాటి మరీ నటించడానికి ఆమెకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కూడా ఓ కారణం అంటున్నారు.రౌడీ బాయ్స్ మూవీకి అనుపమకు రూ.50 లక్షల పారితోషికం అప్పజెప్పారట! ఇప్పటివరకు ఇంచుమించు పాతిక లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకునే అనుపమకు ఇదు కెరీర్‌లో హయ్యస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.