Bigg Boss : బిగ్ బాస్‌లో సంచలనం.. ట్రోఫీ అందుకున్న లేడీ కంటెస్టెంట్
Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం హిందీలో సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఇప్పటికే 14 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 15వ సీజన్ పూర్తి చేసుకుంది. నాలుగు నెలల క్రితం బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాగా జనవరి 30 ఆదివారం గ్రాండ్ ఫినాలే చోటు చేసుకుంది. టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో పోటీపడగా ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్ కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ గెలుచుకున్నారు. మిస్టర్ షెహజ్ పాల్ రన్నర్ గా నిలిచాడు. బుల్లితెర యాక్ట్రెస్ గా పాపులారిటీ ఉన్న తేజస్వి ప్రకాష్ టైటిల్ ఫేవరేట్ గా షోలోకి ఎంటర్ అయ్యారు.
హౌస్ లో ఆమె ముక్కుసూటి తనం, ఏదైనా నిర్భయంగా మాట్లాడే తత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బిగ్‌బాస్ విజేతగా మహిళ నిలవడం ఇది మొదటి సారి కాదు. సీజన్ 12 విజేతగా దీపికా కాకర్ నిలవగా.. సీజన్ 13 నటుడు సిద్ధార్థ్ శుక్లా విన్నర్ అయ్యాడు. ఇక సీజన్ 14 బుల్లితెర నటి రుబినా దిలక్ బిగ్‌బాస్ విన్నర్ కాగా.. సీజన్ 15 టైటిల్ కూడా బుల్లితెర నటినే వరించింది. కోవిడ్ ప్రభావంతో ఈ సారి అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందుకోసం షో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు.గత అక్టోబర్ 2వ సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అయింది.
Bigg Boss : మహిళా విజేత..
దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేశాడు. కరోనా ప్రభావంతో 15వ సీజన్ కోసం షో యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఈ సీజన్ చాలా ప్రత్యేకమైన అంశాలతో ప్రారంభం అయింది. సరికొత్తగా… వాళ్లను కూడా తీసుకొచ్చి 15వ సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగానే కొంత మంది కొత్త పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. అంతేకాదు, ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. అలాగే, ఇంటిని మెయిన్ హౌస్, జంగిల్ హౌస్, వీఐపీ జోన్ వంటి భాగాలుగా చేశారు. అలాగే, గేమ్‌లలో కూడా వైవిధ్యాన్ని చూపిస్తూ షోను ఆసక్తికరంగా నడిపించారు.